అది కచ్చితంగా ఫేక్ న్యూసే..!

Update: 2022-03-22 02:30 GMT
ఒక భాషలో సక్సెస్ అయిన కంటెంట్ ని మరో భాషలోకి రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. మన సినిమాలు ఇతర భాషల్లోకి వెళ్తుంటే.. ఇతర భాషల్లో విజయవంతమైన కథలను తెలుగులో రీమేక్ అవుతున్నాయి.

ఇటీవల కాలంలో చిరంజీవి - వెంకటేష్ - పవన్ కళ్యాణ్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఎక్కువగా రీమేక్ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తుండటంతో ఇప్పుడు వాటి గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.

మలయాళంలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న "బ్రో డాడీ" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ వారు రైట్స్ తీసుకోవాలని చూస్తున్నారని.. వెంకటేష్ - రానా లతో రీమేడ్ చేస్తారని రూమర్స్ వచ్చాయి.

ఇదే క్రమంలో ప్రస్తుతం 'గాడ్ ఫాదర్' అనే మలయాళ రీమేక్ లో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. 'బ్రో డాడీ' సినిమా చేయడానికి సుముఖంగా ఉన్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్‌ లాల్ తో కలిసి నటించిన చిత్రమిది.

'బ్రో డాడీ' చిత్రంలో మీనా - కల్యాణీ ప్రియదర్శన్ మహిళా ప్రధాన పాత్రలు పోషించారు. హీరోయిన్ తో లివ్-ఇన్-రిలేషన్ షిప్ లో ఉన్న హీరో పెళ్లికి ముందే ఆమెను గర్భవతిని చేయడం.. అదే సమయంలో హీరో తల్లితండ్రులు మరో బిడ్డకు జన్మనివ్వడానికి రెడీ అవ్వడంతో వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనేది ఈ కామెడీ ఎంటర్టైనర్ లో చూపించారు.

ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా విడుదలైన 'బ్రో డాడీ' చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే ఇలాంటి కంటెంట్ తో రూపొందిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయినా.. తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడకపోవచ్చు.

దీనికితోడు ఇదే ఫార్ములతో గతంలో అనేక సినిమాలు మనవాళ్ళు చూసేసి ఉన్నారు. ఇప్పుడు స్టార్ హీరోలను పెట్టి రీమేక్ చేసినా ఆదరణ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకే తెలుగులో 'బ్రో డాడీ' రీమేక్ కు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తల్లో నిజం లేకపోవచ్చని చెప్పవచ్చు.
Tags:    

Similar News