ఎన్టీఆర్ సరసన 'యమదొంగ' లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ లో నటించింది మమతా మోహన్ దాస్. ఈ మల్లూ బ్యూటీ అందాల జాతరను మాస్ ఆడియెన్ పిచ్చిగా ఎంజాయ్ చేశారు. గాయనిగా నటిగా మమత అప్పట్లో చాలా జోరు చూపించింది. తర్వాత వెంకటేష్ తో చింతకాయల రవి.. నాగార్జునతో కింగ్ వంటి కొన్ని తెలుగు చిత్రాలలో నటించింది.
మలయాళంలో చాలా సినిమాలు చేసింది. మమతా మోహన్ దాస్ ప్లేబ్యాక్ సింగర్ గాను అలరించింది. శంకర్ దాదా జిందాబాద్ లో ఆకలేస్తే అన్నం పెడ్తా అలిసొస్తే ఆయిల్ పెడతా లాంటి చార్ట్ బస్టర్ సాంగ్ ని పాడింది. యమదొంగలో ఓలమ్మి తిక్కరేగిందా పాటను ఆలపించి శభాష్ అనిపించింది.
ఈ మల్టీట్యాలెంటెడ్ బ్యూటీ ఇంతకుముందు క్యాన్సర్ తో తీవ్ర ఇబ్బందికి గురైంది. కానీ మొక్కవోని ధీక్షతో తన కష్టాన్ని జయించింది. క్యాన్సర్ నుంచి కోలుకుని ఎందరిలోనో స్ఫూర్తిని నింపింది. తాజాగా మమతా మోహన్ దాస్ తన సోషల్ ప్రొఫైల్స్ లో తనకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ నిర్ధారణ అయిందని తెలిపారు. ఇది చర్మం రంగును కోల్పోయేలా చేస్తుంది. బొల్లి తరహా వ్యాధి. నేను నా రంగును కోల్పోతున్నానని మమత స్వయంగా తెలిపారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్.. కలర్ మార్పుతో బొల్లి తరహా జర్నీని సాగిస్తున్నానని తెలిపింది. మనల్ని మనమే నయం చేసుకోవాలి! అని హ్యాష్ ట్యాగ్ లతో రెండు ఫోటోలను కూడా మమత షేర్ చేసింది.
క్యాన్సర్ తో పోరాడి గెలిచిన మమత ఈ బొల్లి వ్యాధి గురించి బహిరంగంగా షేర్ చేయడంతో సెలబ్రిటీలు -నెటిజననులు తన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మమత చివరిగా 'జన గణ మన' అనే కోర్టు రూమ్ డ్రామాలో కనిపించింది. మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తూ మమతా మోహన్ దాస్ బిజీగా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.