సూపర్ స్టార్ రజినీకాంత్ తో వరుసగా కాలా మరియు కబాలి సినిమా లను తెరకెక్కించిన దర్శకుడు రంజిత్ పా. ఇతడు కెరీర్ ఆరంభంలో మంచి సినిమాలను తెరకెక్కించి అవార్డులను సైతం దక్కించుకున్నాడు. అయితే సూపర్ స్టార్ తో సినిమా అనగానే హడావుడి అదనపు హంగులు అవ్వడంతో ప్రేక్షకులు తిరష్కరించారు. రజినీకాంత్ తో రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేసే అవకాశం అతడికి వచ్చింది అంటే అతడి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి ప్రతిభ పై నమ్మకంతోనే అంతటి స్టార్ వరుస ఆఫర్లు ఇచ్చాడు. రెండు సినిమాలు ప్లాప్ అయినా కూడా అతడిపై తమిళ ఇండస్ట్రీ వర్గాల్లో స్టార్స్ లో నమ్మకం మాత్రం తగ్గినట్లుగా కనిపించడం లేదు. వెంటనే రంజిత్ పా మరో సినిమాకు సిద్దం అయ్యాడు.
యూనివర్శిల్ స్టార్ హీరోగా రంజిత్ పా ఒక సినిమాను చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం విక్రమ్ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తున్న కమల్ హాసన్ ఆ తర్వాత రంజిత్ పా దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకుని అవార్డులు.. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న దర్శకుడు రంజిత్ పా ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ కథను కమల్ హాసన్ కు వినిపించాడట. ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే నటించేందుకు కమిట్ అయ్యాడట. ఈ సినిమాను తన సొంత బ్యానర్ లోనే కమల్ నిర్మించాలని కూడా భావిస్తున్నట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు.
కమల్ హాసన్ విక్రమ్ సినిమా కు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే వచ్చిన ఆ సినిమా గ్లిమ్స్ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది. సౌత్ లోనే స్టార్ నటులు అయిన ఫాహద్ ఫాజిల్ మరియు విజయ్ సేతుపతిలు విక్రమ్ లో నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను దర్శకుడు రూపొందిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో విడుదల కాబోతున్న విక్రమ్ తర్వాత అవార్డు విన్నింగ్ డైరెర్టకర్ పా రంజిత్ దర్శకత్వంలో కమల్ సినిమా ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ లోకేష్ కనగరాజ్ మరియు పా రంజిత్ వంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్న కమల్ హాసన్ తన అభిమానులకు మంచి సినిమాలను ఇవ్వబోతున్నట్లుగా అరవ మీడియా కథనాలు రాస్తోంది. కమల్ వీరిపై పెట్టుకున్న నమ్మకంను ఎంత వరకు నిలుపుకుంటారు అనేది చూడాలి.