సౌత్ స్టార్ హీరో విశాల్ ధాతృత్వం సేవా గుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాజిక కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకుంటారు. సహాయం కావాలని ఆయన్ని ఆశ్రయిస్తే తప్పక సాయం అందుతుంది. ఎంత గొప్ప నటుడో అంతకు మించి మంచి మనసున్న వ్యక్తి. ఇంతకుముందు రైతు ఆత్మహత్యలను చూసి చలిచిపోయి సాయం చేసిన తొలి నటుడు కూడా విశాల్. తన సినిమా టిక్కెట్ నుంచి ప్రతీ రూపాయి రైతుకి విరాళంగా వెళ్లేలా చర్యలు తీసుకున్న నటుడాయన. ఇలా చెప్పుకుంటూ పోతే విశాల్ ధాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా విశాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
విశాల్.. ఆర్య నటిస్తున్న `ఎనిమీ` దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విశాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. `పునీత్ రాజ్ కుమార్ మా ఇంట్లో మనిషి. ఆయన చనిపోయి ఇన్ని రోజులైనా ఇంకా పునీత్ నా మనసులో జీవంగానే ఉన్నాడు. పునీత్ నిర్వహిస్తోన్న కార్యక్రమాలు ఏవీ నిలిచిపోకూడదు అనే ఉద్దేశంతో 1800 మంది విద్యార్ధుల బాధ్యతను నేను తీసుకుంటున్నా. ఇల్లు కొనుక్కోవాలని కొంత డబ్బు జమ చేసా. ఇప్పుడు డబ్బుని విద్యార్ధుల కోసం కేటాయిస్తాను. వాళ్లంతా చదువుకుని ఉన్నతంగా స్థిరపడే వరకూ నా సహాయ కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయ``ని విశాల్ తెలిపారు.
దీంతో విశాల్ మరోసారి సోషల్ మీడియాలో రియల్ హీరోగా వెలిగిపోతున్నాడు. విశాల్ వ్యక్తిత్వం.. అతని గొప్ప మనసును ఉద్దేశించి ఫాలోవర్స్ ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. నెటిజనుల నుంచి విశాల్ పై ఏనాడూ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు. అంటే విశాల్ ఎంత గొప్ప వ్యక్తో మరోసారి ప్రూవ్ అయింది. ఇక ఎనిమీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు యాక్షన్ థ్రిల్లర్ పై అంతకంతకు అంచనాల్ని పెంచేస్తున్నాయి. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు.