అభిమాని పెళ్లికి హాజరైన స్టార్ హీరో.. అందరూ షాక్!
ఒక నటుడు స్టార్ హీరోగా ఎదగడంలో.. తన కష్టం ఎంతుంటుందో.. అభిమానుల పాత్ర కూడా అంతే ఉంటుంది. జయాపజాలకు అతీతంగా తమ హీరోను అభిమానిస్తుంటారు ఫ్యాన్స్. వారి సినిమా హిట్ అయితే.. వీరు సంబరాలు చేసుకుంటారు. మూవీ ఫ్లాప్ అయితే.. హీరోలకన్నా ఎక్కువగా బాధపడుతుంటారు. ఈ విషయాన్ని కొందరు హీరోలు మనస్పూర్తిగా అంగీకరిస్తారు. అలాంటి వారిలో తమిళ్ స్టార్ సూర్య ఒకరు.
తనకు అభిమానుల మీద ఎంత ప్రేమ ఉందో.. సూర్య తరచూ చాటుకుంటూనే ఉంటాడు. తాజాగా ఆయన ఓ అభిమాని పెళ్లికి వెళ్లి అందరినీ షాక్ కు గురిచేశాడు. సూర్య వీరాభిమాని, ఆలిండియా సూర్య ఫ్యాన్ క్లబ్ సభ్యుడు హరి వివాహం ఇటీవలే జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సూర్య వివాహ సమయానికి పెళ్లి మండపానికి చేరుకుని అక్కడున్నవారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
అంతేకాదు.. తాళిబొట్టును స్వయంగా తన చేతులతో పెళ్లి కుమారుడికి అందించాడు. అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులతో కలిసి వివాహ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించాడు. మీ ప్రయాణం సంతోషంగా సాగాలంటూ వధూవరులను ఆశీర్వదించాడు. బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి మరీ తన పెళ్లికి విచ్చేయడంతో సదరు అభిమాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. పెళ్లి మండపంలో సూర్య సందడి చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. గౌతమ్ మీనన్ 'నవరస' షార్ట్ ఫిల్మ్‌లో సూర్య ప్రధాన పాత్ర పోషించనున్నాడు. తొమ్మిది కథలుండే ఈ చిత్రాన్ని తొమ్మిది మంది దర్శకులు డైరెక్ట్ చేస్తుండడం విశేషం. వీళ్లందరూ రెమ్యునరేషన్ ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్న ఈ చిత్ర లాభాలను.. ఇండస్ట్రీలోని పది వేల మంది కార్మికులకు పంచి పెట్టనున్నారు. మరోవైపు.. సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్న విషయం తెలిసిందే.