మ‌ళ్లీ అడుగుపెడుతున్న ‘ఆచార్య‌’?

Update: 2021-05-03 02:30 GMT
దేశంలో, రాష్ట్రంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. వైర‌స్ దెబ్బ‌కు సినిమా ఇండ‌స్ట్రీ అత‌లాకుత‌ల‌మైపోయింది. ఇప్ప‌టికే థియేట‌ర్లు మూత‌ప‌డ‌గా.. సినిమా షూటింగులు కూడా దాదాపుగా నిలిచిపోయాయి. షెడ్యూల్ మ‌ధ్య‌లో ఉన్న ఒక‌టీ రెండు సినిమాలు మాత్ర‌మే క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్నాయి.

నిజానికి.. టాలీవుడ్లో సెకండ్ వేవ్ కార‌ణంగా నిలిచిపోయిన తొలి సినిమా మెగాస్టార్ ఆచార్య‌నే. ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న సోనూ సూద్ కొవిడ్ బారిన ప‌డిన త‌ర్వాత.. రెండు రోజులపాటు షూట్ కంటిన్యూ చేసిన యూనిట్‌.. అర్ధంత‌రంగా ప్యాక‌ప్ చెప్పేసింది. మెగాస్టార్ నిర్ణ‌యంతోనే షూటింగ్ ర‌ద్దు చేసిన‌ట్టు స‌మాచారం.

అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన షూట్ మ‌రీ ఎక్కువేం లేదు. కొంత ప్యాచ్ వ‌ర్క్ మిగిలిపోయింది. అది కూడా రెండు వారాలు షూట్ చేస్తే ఫినిష్ అయిపోతుందట‌. కానీ.. అనివార్యంగా చిత్రీక‌ర‌ణ నిలిపేయాల్సి వ‌చ్చింది. దీనివ‌ల్ల పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కంటిన్యూస్ గా సాగే ప‌రిస్థితి లేదు.

కాబ‌ట్టి.. ఆ మిగిలిన షూట్ ను ఇప్పుడు కంప్లీట్ చేయాల‌ని యోచిస్తోందట యూనిట్‌. ఎలాగోలా ఆ ప్యాచ్ వ‌ర్క్ కంప్లీట్ చేస్తే.. తాపీగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చూసుకోవ‌చ్చ‌ని అనుకుంటున్నార‌ట‌. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే ఆగ‌స్టు నాటికి సినిమా రిలీజ్ చేయాల‌ని చూస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి, కొవిడ్ ఇంత తీవ్రంగా ఉన్న ప‌రిస్థితుల్లో షూటింగ్ చేస్తారన్న‌ది నిజ‌మా? లేక పుకారా? అన్న‌ది చూడాలి.


Tags:    

Similar News