కరోనా కారణంగా మార్చిలో మూత పడ్డ థియేటర్లు దాదాపు ఎనిమిది నెలల తర్వాత మళ్లీ తెరుచుకున్నాయి. అయితే కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో పాత సినిమాలతో నెట్టుకు వస్తున్నారు. నేడు రెండు మూడు సినిమాలు విడుదల అయినా కూడా జనాలు కనీసం ఆ సినిమాల గురించి కూడా మాట్లాడుకోవడం లేదు అనేది టాక్. అందుకే జనాలను థియేటర్లకు రప్పించేందుకు వారికి థియేటర్లను మళ్లీ అలవాటు చేసేందుకు గాను ఓటీటీలో ఈమద్య విడుదల అయిన సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
థియేట్లలో ఓటీటీ సినిమాలను విడుదల అవ్వనిచ్చేది లేదు అంటూ గతంలో థియేటర్ల సంఘం పేర్కొంది. కాని జనాలకు థియేటర్లు మళ్లీ అలవాటు అయ్యే వరకు థియేటర్లు ఖాళీగా ఉండకుండా.. పాత సినిమాలు వేయకుండా ఉండేందుకు గాను ఓటీటీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో థియేటర్ల సంఘం వారు ఉన్నారట.
దిల్ రాజు నిర్మించిన 'వి' నుండి మొదలుకుని రాజ్ తరుణ్ నటించిన 'ఒరేయ్ బుజ్జిగా' వరకు పలు సినిమాలను థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. థియేటర్లలో ఈ సినిమాలను విడుదల చేసేందుకు కావాల్సిన అనుమతులు మరియు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. నామమాత్రపు రేటుకు నిర్మాతలు సైతం ఈసినిమాలను విడుదల చేసేందుకు ఒప్పుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లు మరియు థియేటర్ల వారు నష్టపోకుండా నిర్మాతలు ఓటీటీ సినిమాలను వారికి ఇవ్వడం.. వచ్చిన దాంట్లో నుండి షేర్ చేసుకునే ఒప్పందంతో సినిమాలను విడుదల చేస్తారని అంటున్నారు. త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.