ప్రేమ లేదంటూనే.. పుకార్లు పుట్టిస్తున్నారు

Update: 2022-10-12 01:30 GMT
సినిమా ప్రపంచంలో హీరో హీరోయిన్ మధ్యలో ప్రేమలో చిగురించడం అనేది చాలా కామన్. కానీ ఆ విషయాన్ని కొంతమంది అధికారికంగా బయట పెడితే మరి కొందరు మాత్రం కాస్త కూడా బయట పెట్టేందుకు ఇష్టపడరు. ఇక మరికొందరు మాత్రం బయటకు విషయం లీక్ అయినా కూడా అందులో నిజం ఉందో లేదో అనే కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక కీయరా అద్వానీ సిద్ధార్థ మల్హోత్రా మధ్యలో ఏం కొనసాగుతుందో ఏమో కానీ వీరు మాత్రం ఫ్యాన్స్ లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు.  

గత రెండేళ్ల కాలం నుంచి కీయరా అలాగే సిద్ధార్థ మల్హోత్ర ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ లో ఈ చాలా రకాల పుకార్లు వెలువడ్డాయి. అయితే మధ్యలో కీయరా మాత్రం అందులో ఎలాంటి నిజం లేదు అని చెప్పేసింది. అలాగే సిద్ధార్థ కూడా ఆమె ఒక మంచి స్నేహితురాలు అని కూడా చెప్పాడు. కానీ ఆ తర్వాత మళ్లీ కరణ్ జోహార్ షోలో కీయారా అద్వానీ అతను స్నేహితుడు కంటే ఎక్కువ అంటూ మరో డౌట్ క్రియేట్ చేసింది.

లవ్ రూమర్స్ అనగానే ఆమె సిగ్గుపడుతూ నవ్వడం మరింత గాసిప్స్ కు తావిచ్చినట్లు అయ్యింది. రీసెంట్ గా ఇద్దరు కలిసి మరో పార్టీకి వెళ్లిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అశ్విని యార్డి సోమవారం ముంబైలోని తన ఆఫీసులోనే ఒక ప్రత్యేకమైన పుట్టినరోజు పార్టీని ఏర్పాటు చేయగా ఆ వేడుకకు సిద్ధార్థ మల్హోత్రా కీయరా హాజరయ్యారు.

ఇక వారిద్దరు అలా కలిసి రావడంతో మళ్లీ బాలీవుడ్ మీడియాలో గాసిప్స్ మొదలయ్యాయి. ఇదివరకే వీరిద్దరూ షేర్షా సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక అప్పుడే తమ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది అని కూడా వీరు తెలియజేశారు.

ఇక ఎప్పటికప్పుడు ప్రేమకు సంబంధించిన వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా అధికారికంగా అయితే వీళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. అలాగని ప్రతి న్యూస్ పై కూడా పెద్దగా స్పందించడం లేదు. ఇక వార్తలు ఎన్ని రకాలుగా వచ్చినా కూడా వారి మధ్య అదే సాన్నిహిత్యం అయితే కొనసాగుతున్నట్లు అనిపిస్తోంది. మరి ఈ విషయంపై ఈ జంట ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News