యంగ్ హీరో శ్రీ విష్ణు ఇతర హీరోలతో పోలిస్తే వైవిధ్యం ఉన్న కథాంశాలతో సినిమాలు చేస్తుంటాడు. కమర్శియాలిటీ కంటే రియాలిటీ నేచురాలిటీకే అతడి ప్రాధాన్యత. ఆ ఆలోచనే శ్రీ విష్ణుకి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చి పెట్టింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ కెరీర్ బండిని నడిపిస్తున్నాడు. ఇటీవలే బ్రోచేవారెవరురా చిత్రంతో విజయం అందుకున్నాడు. అటుపై అతడు పారితోషికం పెంచాడనే రూమర్లు వినిపించాయి. ఇది నిజమేనా అంటూ అతడిని మీడియా సూటిగ్ అడిగేస్తే దానికి అంతే సూటిగా సమాధానం చెప్పాడు.
బ్రోచేవారెవరురా తర్వాత మూడు సినిమాలు సైన్ చేసాను. కానీ వీటిలో దేనికీ పారితోషికం ఎక్కువ తీసుకోలేదు. ఇకపై రెమ్యునరేషన్ పెంచుతాను అంటూ సూటిగా సుత్తి లేకుండా చెప్పాడు. కానీ ఇప్పుడు అతడి సీన్ రివర్స్ అయింది. ఇటీవల విడుదలైన 'తిప్పరా మీసం' బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. బ్రోచేవారెవరురా తర్వాత మరో హిట్ కొడదామనుకున్నకోరిక నెరవేరలేదు. దీంతో శ్రీ విష్ణు ఇప్పట్లో పారితోషికం పెంచే అవకాశం లేదు. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలున్నాయి కాబట్టి వీటిలో ఏదైనా సక్సెలు కొడితే పారితోషికం పెంచే ఛాన్సుంటుంది.
కెరీర్ పరంగా శ్రీవిష్ణు మిగతా యంగ్ హీరోలతో పోలిస్తే బెటర్ పోజిషన్ లోనే ఉన్నాడు. నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరో కాబట్టి ఆ రకంగా ప్రతికూల పరిస్థితులేవీ లేవు. ఇమేజ్ చట్రం దాటి సినిమాలు చేయగల నటుడిగా అతడికి పేరొచ్చింది కాబట్టి అది నిలబెడుతోంది. సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన వాడు కాబట్టి ఆ తరహా పాత్రలు అందిపుంచుకుంటూనే హీరోగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. ఇక పారితోషికాల్లోనూ పట్టూ విడుపూ ఉంటే అవకాశాలకు ఎప్పటికీ కొదవుండదు.