సుకుమార్-బన్నీ అనుకునే టైటిల్ అదేనా..?

Update: 2020-04-03 17:30 GMT
స్టైలిష్ చిత్రాల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 20వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కాబట్టి హ్యాట్రిక్ కొడతారని ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాసను మాట్లాడుతూ నెరిసిన గడ్డంతో లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేటెస్ట్ ట్రెండీ బ్యూటీ రష్మిక మందానను హీరోయిన్ గా ఖరారు చేసారు. ఈ నేపథ్యంలో బన్నీ, సుక్కుల అభిమానులకు ఊరటనిచ్చేందుకు కనీసం సినిమా ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేయాలని ఫిక్సయిందట చిత్ర బృందం.

అందుకోసమే ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా బన్నీ లుక్ రిలీజ్ చేసి కొంచెం ఊరట కలిగిద్దామని అనుకున్నారట. అయితే ఫస్ట్ లుక్ నే కాదు సినిమా టైటిల్ కూడా ప్రకటిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ మరియు ఫ్యాన్స్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సుక్కు టీమ్ ఫస్ట్ లుక్ మీద వర్క్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ సుకుమార్-బన్నీల కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు ఆర్య, ఆర్య2 అని పేరు పెట్టినట్లే ఈ సినిమాకి కూడా రెండు అక్షరాలతో టైటిల్ పెట్టడానికి ట్రై చేస్తున్నారట సుకుమార్ అండ్ టీమ్. చూడాలి మరి వీరి టీమ్ నుండి ఎలాంటి సందేశం అందుతుందో తెలియాలంటే ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందే!
Tags:    

Similar News