విజ‌య్ మార్కెట్ ఆయ‌న పెంచేదేంటి?

Update: 2019-01-04 01:30 GMT
తాడొక‌రిది అయితే బొంగ‌రం ఇంకొక‌రిది.. అన్న చందంగానే ఉంటుంది టాలీవుడ్ లో వ్య‌వ‌హారం. సొమ్మొక‌డిది.. సోకు ఇంకొక‌డిది అనే టైపు డీలింగ్స్ మ‌న ప‌రిశ్ర‌మ‌లో చూస్తున్నాం. ఎవ‌రో సినిమాని నిర్మిస్తారు. చివ‌రికి రిలీజ్ చేయ‌లేక చ‌తికిల‌బ‌డితే దానిని రిలీజ్ చేయించేందుకు ఇంకెవ‌రో బ‌రిలో దిగుతారు. చివ‌రికి మొద‌ట సినిమా తీసిన వాళ్ల పేరు వినిపించ‌దు. రిలీజ్ చేసిన వాడి పేరే వినిపిస్తుంది. అంతేకాదు లాభాలు దండుకునేది వీళ్లే.

అవ‌త‌లి వారి నిస్స‌హాయ‌త‌ను ఇలా తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుంటారు. ఇకపోతే ఎన్నో వివాదాల మ‌ధ్య డ‌బ్బింగ్ సినిమాల్ని రిలీజ్ చేసేవాళ్లు కూడా తామే గొప్ప అని, త‌మ వ‌ల్ల‌నే ఆ సినిమా రిలీజైంద‌ని చెప్పుకుంటే దానిని ఏమ‌నాలి? త‌మిళ స్టార్ హీరో  విజ‌య్ కి తెలుగులో నేనే మార్కెట్ పెంచానంటూ ఓ నిర్మాత‌ ప్ర‌చారం చేసుకోవ‌డం చూస్తుంటే, ఇది నిజ‌మా? అంటూ ముక్కున వేలు వేసుకున్నారు కొంద‌రైతే. .. పోటీలో హ‌క్కులు కొనుక్కున్నారు.. రిలీజ్ చేశారు.. అంతే క‌దా? అంటూ మాట్లాడుకున్నారు. అయితే విజ‌య్ కి ఆయ‌న మార్కెట్ పెంచ‌డ‌మేంటి?  ఆ ప్లేస్ లో వేరొక‌రు ఆ ప‌ని చేయ‌లేరా? అంటూ గుస‌గుస‌లు వినిపించాయి.

అదంతా అటుంచితే, అస‌లు స‌ర్కార్ సినిమా తెలుగులో హిట్ట‌య్యింది అంటూ ఆయ‌న చేస్తున్న ప్ర‌చారాన్ని న‌మ్మేందుకు ఎవ‌రూ సిద్ధంగా లేరు. `సర్కార్` చిత్రం త‌మిళంలో హిట్ అన్న మాట వ‌చ్చినా డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు న‌ష్టాలు త‌ప్ప‌లేద‌ని మాట్లాడున్నారు. ఓవ‌ర్ బ‌డ్జెట్, కాస్ట్ ఫెయిల్యూర్ వ‌ల్ల స‌ర్కార్ చిత్రం త‌మిళ‌నాట ప‌లువురు పంపిణీదారులు న‌ష్ట‌పోయేలా చేసింది. సేమ్ సీన్ `న‌వాబ్` చిత్రానికి త‌లెత్తింది. మ‌ణిర‌త్నం లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన `న‌వాబ్` ఓవ‌ర్ బ‌డ్జెట్ వ‌ల్ల న‌ష్టాలు తప్ప‌లేద‌న్న మాటా వినిపించింది. అయితే న‌వాబ్, స‌ర్కార్ చిత్రాలు తెలుగులో విజ‌యం సాధించాయ‌ని ప్ర‌చారం చేయ‌డం ఓ కొస‌మెరుపు. వాస్త‌వానికి ఈ సినిమాల‌ ట్రేడ్ రిపోర్ట్ వేరొక‌లా ఉంద‌ని మీడియాలో అప్ప‌ట్లో క‌థ‌నాలొచ్చాయి.

అయితే న‌వాబ్, స‌ర్కార్ వంటి చిత్రాల న‌ష్టాల‌ ప్ర‌భావంతో కోలీవుడ్ లో ప‌లు భారీ ప్రాజెక్టులు క్యాన్సిల్ అయ్యాయ‌న్న మాటా ఇటీవ‌ల‌ వినిపించింది. అప్ప‌ట్లో ధ‌నుష్ ఎంతో ప్ర‌య‌త్నం చేసి ఓ భారీ హిస్టారిక‌ల్ మ‌ల్టీస్టార‌ర్ ని సెట్ చేయాల‌నుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ అర్థాంత‌రంగా క్యాన్సిల్ అయ్యింది. దానికి కార‌ణం ఓవ‌ర్ బ‌డ్జెట్, కాస్ట్ ఫెయిల్యూర్స్ తో సినిమాలు తీసినా లాభాల మాట దేవుడెరుగు.. తీవ్రంగా న‌ష్ట‌పోవాల్సొస్తోంద‌న్న వాద‌నే ప్ర‌ధాన కార‌ణం అయ్యిందిట‌. అయితే నిర్మాత‌లు ప్ర‌చారం చేసేది ఒక‌టి.. వాస్త‌వం ఇంకొక‌టి అని తాజా ప్ర‌చారం అర్థ‌మ‌య్యేలా చెబుతోంది.





Full View
Tags:    

Similar News