నమిత జీవితంలో ఆ ఐదేళ్లు చీకటి రోజులట

Update: 2021-02-05 01:30 GMT
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన నమిత ఆమద్య విపరీతంగా బరువు పెరిగింది. ఆమె బాగా మద్యం తాగడంతో పాటు పొగ తాగే అలవాటు ఉండటం వల్లే అధిక బరువు పెరిగిందని ప్రచారం జరిగింది. ఆమెకు బరువు పెరిగిన సమయంలో మొదట సినిమా ఆఫర్లు వచ్చినా ఆ తర్వాత ఆఫర్లు కనుమరుగయ్యాయి. తమిళం మరియు తెలుగు ఎక్కడ కూడా ఈమెకు ఆఫర్లు లేకుండా పోయాయి. దాంతో మళ్లీ ఆమె బరువు తగ్గేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. బరువు తగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న నమిత ఈమద్య కాస్త బరువు తగ్గి కనిపిస్తుంది. మునుపటి నాజూకుతనం రావాలంటే ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. కాని ప్రస్తుతానికి అయితే పర్వాలేదు అన్నట్లుగా ఆమె బరువు ఉంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో నమిత మాట్లాడుతూ.. తాను బరువు పెరగడానికి కారణం మద్యం మరియు సిగరెట్లు అంటూ బయట ప్రచారం జరిగింది. కాని తనకు ఆ అలవాటే లేదు. ఆ ప్రచారం జరిగిన సమయంలో చాలా బాధ పడ్డాను. నాకే ఎందుకు ఇలా జరిగింది అంటూ ఆవేదన పడేదాన్ని. తాను అయిదు సంవత్సరాల పాటు విపరీతమైన డిప్రెషన్‌ కు లోను అయ్యాను. ఆ సమయంలో సరైన ఆహారం తీసుకునేదాన్ని కాదు. జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడంతో పాటు థైరాయిడ్‌ సమస్య కూడా నన్ను బాధ పెట్టింది. ఆ కారణంగానే తాను లావు అయ్యాను. ఆ అయిదు సంవత్సరాలు నా జీవితంలో చీకటి రోజులు అంటూ అభివర్ణించింది. సన్నబడ్డ నమిత మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీకి ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల ఈమె జిమ్‌ లో వర్కౌట్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.




Tags:    

Similar News