టాప్ స్టోరి: దేశంపై ప‌డ్డ గ‌జ‌దొంగ‌లు!

Update: 2018-09-26 08:42 GMT
మిలియ‌న్ డాల‌ర్ వ‌ర‌ల్డ్ .. బిలియ‌న్ ట్రిలియ‌న్ డాల‌ర్ వ‌ర‌ల్డ్‌ గా మారుతోంది! సినీప్ర‌పంచం విస్త్ర‌తి అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇలాంటి వేళ బాలీవుడ్ వాళ్లు టాలీవుడ్ పై ప‌డుతున్నారా? అంటే గ‌్యారెంటీగా అని చెప్పొచ్చు. ఇదిగో ఇదే ప్రూఫ్‌.

``హ‌లో నా పేరు అమితాబ్ బ‌చ్చ‌న్ .. హ‌లో నా పేరు అమీర్ ఖాన్‌.. మేమిద్ద‌రం క‌లిసి మొద‌టి సారిగా మా నెక్ట్స్ మూవీ య‌శ్‌ రాజ్ ఫిలింస్ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌`తో వ‌స్తున్నాం. ఈ స్పెష‌ల్ ఫిలింని మీతో షేర్ చేద్దామ‌నుకుంటున్నాం. ఈ దీపావ‌ళికి థ‌గ్స్ వ‌స్తున్నారు. సినిమా హాల్స్‌లో క‌లుద్దాం`` అంటూ పెద్ద షాకిచ్చారు ఆ దొంగ‌లిద్ద‌రూ. ఇంత‌కీ వీళ్లు దొంగ‌లా అంటే కానేకాదు.. అంత‌కుమించి.. గ‌జ‌దొంగ‌లు.. బందిపోట్లు!! వంద‌ల‌కోట్ల వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టే గ‌జ‌కంత్రీ బందిపోట్లు.

2018 మోస్ట్ అవైటెడ్ మూవీగా ప్ర‌చారం అవుతున్న `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` హీట్ అటు బాలీవుడ్‌ లోనే కాదు - ఇటు టాలీవుడ్‌ - కోలీవుడ్‌ ల‌ను ఒణికిస్తోంది. ఈ సినిమా తెలుగు - త‌మిళ‌ రిలీజ్ కి స్ఫూర్తి బాహుబ‌లి అన‌డంలో సందేహం లేదు. న‌వంబ‌ర్ 8న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా హిందీ - తెలుగు - త‌మిళ వెర్ష‌న్ల‌ను రిలీజ్ చేస్తున్నామ‌ని ఏకంగా అమితాబ్ - అమీర్ అంత‌టి స్టార్లే లైన్‌ లోకొచ్చేశారంటే స‌న్నివేశం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. అమితాబ్ - అమీర్‌ ఖాన్ స్వ‌చ్ఛ‌మైన తెలుగు భాష‌లో మాట్లాడుతూ.. తెలుగు వాళ్ల‌కు పెద్ద బిస్కెట్టే వేశారు. దీపావ‌ళికి థియేట‌ర్ల‌లో క‌లుసుకుందాం అంటూ పెద్ద‌ షాకిచ్చారు. ఇక్క‌డ దోచుకున్న‌వాడికి దోచుకున్నంత‌. దొంగ‌త‌నంలో స్కిల్ తెలియాలంతే.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View

Tags:    

Similar News