దాదాపు టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియో మోజులో ఉన్న సంగతి తెలిసిందే. కంటెంట్ ఎలా ఉన్నా సరే కొంత మంది హీరోలు పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలని సీరియస్ గానే కనిపిస్తున్నారు. ఈ రేసులో సక్సెస్ శాతం తక్కువగా ఉన్నా! ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. వస్తే కొండ పోతే నష్టం తప్ప అంతకు మించి ఏముంటుంది? అన్న లెక్కలో పాన్ ఇండియాలో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా మాస్ రాజా రవితేజ కూడా తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లే కనిపిస్తున్నాడు. ఇప్పటివరకూ వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న రాజా నాగేశ్వరరావుతో భారీ విజయాన్ని అందకున్ని అన్ని విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నాడు.
ప్రొడెక్ట్ పై కూడా కాన్పిడెంట్ గా ఉన్నాడు. ఇలాంటి నమ్మకాలు రాజాకి కొత్తేం కాదు. గతంలో విడుదలైన అన్ని సినిమాలపై అదే తరహాన్ని వ్యక్తం చేసాడు అనుకోండి! కానీ నాగేశ్వరరావు పై అంతకు మంచి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
దీంతో ప్రేక్షకాభిమానుల్లోనూ అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా పబ్లిసిటీ ప్లానింగ్ రవితేజ బాలీవుడ్ హీరోల తరహాలో చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక్కో భాష నుంచి ఒక్కో పెద్ద స్టార్ ని ఎంపికచేసుకుని సినిమాని ప్రమోట్ చేసుకోవాలని భావిస్తున్నాడుట.
ఇప్పటికే కన్నడ పరిశ్రమ నుంచి శివరాజ్ కుమార్ ని లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ గ్లింప్స్ కి కన్నడలో ఆయనే వాయిస్ ఓవర్ అందించారు.
ఆయన ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునేందుకు అక్కడ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా మిగతా భాషల నుంచి పేరున్న హీరోలందర్నీ రంగంలోకి దించే అవకాశం ఉంది. రవితేజ పాన్ ఇండియా ప్లాన్ ఎప్పుడో చేయాల్సింది. ఆయన సినిమాలు హిందీ లో డబ్ అయి సక్సెస్ అయిన చిత్రాలు చాలానే ఉన్నాయి.
అలాగే యూట్యూబ్ లో ఆయన సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. సోనీ మ్యాక్స్ లాంటి ఛానల్ లో ప్రసారమయ్యే రవితేజ చిత్రాల్ని నార్త్ ఆడియన్స్ పడి పడి చూస్తుంటారు. కానీ ఇంత కాలం హిందీ మార్కెట్ పై దృష్టి పెట్టకపోవడంతో ఛాన్స్ మిస్ చేసుకోవాల్సి వచ్చకింది. ఇప్పుడు నాగేశ్వరరావుతో రావడం ఆలస్యమైనా పక్కాగానే బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది.