ఆ సీన్స్ ఎవరు డిమాండ్ చేస్తున్నరబ్బా

Update: 2016-02-11 17:30 GMT
లోకల్ భామలను కాకుండా.. పక్క భాషల నుచి కొత్త హీరోయిన్స్ ను తెచ్చుకోవడంలో టాలీవుడ్ కు చెరగని రికార్డ్ ఉంటుంది. ఎవరూ దాన్ని అందుకోలేరు కానీ.. ఇలా వచ్చిన సుందరాంగులు చెప్పే సంగతులు వింటుంటే భలే ఆశ్చర్యం వేస్తుంది. సినిమాలో గ్లామర్ షో చేసి ఇరగదీసేసే ఈ వయ్యారి భామలు.. ఈ మధ్య పబ్లిక్ ఈవెంట్లలోనూ అందాలు ఆరబోసేస్తున్నారు. అలాగే అడిగిన వారికల్లా ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తూ.. బోలెడన్ని కబుర్లు కూడా చెబుతున్నారు.

హేభా పటేల్ - మెహ్రీన్ పీర్జాడా లతో పాటు మరికొంత భామలకు.. ఇంటర్వ్యూల్లో గ్లామర్ షో - లిప్ లాక్ ల గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. వీళ్లంతా కామన్ గా చెప్పే సమాధానం ఒకటే ఉంటుంది. 'బికినీ వేసుకునేందుకు, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేందుకు అభ్యంతరం లేదు. కానీ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మాత్రమే చేస్తాను. కావాలని ఇరికించే సన్నివేశాల్లో అయితే, చేయడం నాకిష్టం ఉండదు' అంటూ గారాలు పోతుంటారు ఈ ముద్దుగుమ్మలు.

ఇప్పుడొచ్చిన సినిమాలను చూస్తే.. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే పెట్టే లిప్ లాక్ సీన్స్ మచ్చుకైనా కనిపించవు. బికినీలు - ముద్దల కోసం స్క్రిప్ట్ మార్చుకు రాసుకోవడమే. ఇంకా చెప్పాలంటే వీరికి చెల్లిస్తున్న భారీ రెమ్యూనరేషన్ ఇలా డిమాండ్ చేస్తోంది. అంతే తప్ప స్క్రిప్ట్ డిమాండ్ చేస్తోందనడం ఒట్టి మాటే. ఇప్పుడు మూతి ముద్దులు అన్ని సినిమాల్లోనూ కామన్ అయిపోతున్నాయ్ కాబట్టి.. ఇకపై ఇలాంటి ప్రశ్నలు అడిగేబదులు.. ఎన్ని కిస్సింగ్ సీన్స్ ఉన్నాయ్ అంటే సరిపోతుందేమో.
Tags:    

Similar News