దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన ఆకలి బాధలను తీర్చడం ఒక ఎత్తయితే.. సొంత ఊళ్లకు వెళ్లలేక చిక్కుకుపోయిన వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడం మరొక ఎత్తు. అయితే బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ ఎవరు ఊహించని విధంగా తన సొంత ఖర్చులతో పేదలను సొంత గ్రామాలకు పంపే కార్యక్రమాన్ని చేపట్టాడు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను సొంత ఖర్చులతో చేచేసాడు. రీల్ లైఫ్ లో విలన్ అయిన సోనూసూద్ తన మంచి మనసుతో రియల్ లైఫ్ లో హీరో అనిపించుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఉపాధిలేక ఉండేందుకు నీడ లేక ప్రజారవాణా లేక తమ సొంత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడుతుందటే నిత్యం వేల మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారికి ప్రత్యేకంగా బస్సులు విమానాలు ట్రైన్ లు ఏర్పాటు చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. దీంతో కేంద్ర మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఆయన సేవలను కొనియాడారు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా సరే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేంత స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ లాగా టాలీవుడ్ లో ఏ యాక్టర్ ముందుకు రాడా అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది వలస కూలీలు కనీసం ప్రయాణానికి సరిపడా ఆర్థిక స్తొమత లేక ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పటికైనా స్పందించి కనీసం ఏపీ నుండి తెలంగాణా కి.. తెలంగాణా నుండి ఏపీ కి స్పెషల్ బస్సులు వేసి వారిని సొంతూళ్లకు చేర్చే ఆలోచన చేసి రియల్ హీరోస్ అనిపించుకుంటే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమాజానికి సేవ చేసే పనులు వదిలేసి ఆ ఛాలెంజులు ఈ ఛాలెంజులు అంటూ పసలేని ఛాలెంజులు విసురుకుంటూ.. దోసెలు వేస్తూ ఇల్లు క్లీన్ చేస్తే రియల్ హీరోస్ అనిపించుకోరని కామెంట్స్ చేస్తున్నారు. రియల్ ఛాలెంజ్ అంటే సోనూసూద్ చేసిన విధంగా ఆలోచించాలని వారు సూచిస్తున్నారు. మంచు మనోజ్, ప్రకాష్ రాజ్ లాంటి వారు తమ పరిధిలో వలస కూలీలలను సొంతూళ్లకు పంపించి మానవత్వాన్ని చాటుకుని రియల్ హీరోస్ అనిపించుకున్నారని.. వారిని స్ఫూర్తిగా తీసుకోనైనా మిగతా వారు స్పందిస్తే బాగుండేదని వారు కామెంట్స్ చేస్తున్నారు.