టాలీవుడ్ కు కలిసిరాని దసరా

Update: 2022-10-07 00:30 GMT
ఒకప్పుడు మినిమమ్ యావరేజ్ అందుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఎంతోకొంత ప్రాఫిట్స్ అయితే అందించేవి. అప్పట్లో లెక్కలు వేసుకొని మరి దర్శకులు హీరోలు సినిమాలు తీసిన విధానం మంచి బిజినెస్ ను క్రియేట్ చేశాయి. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పప్పులు అస్సలు ఉడకడం లేదు. సినిమా ఎంతో బాగుంటే గాని జనాలు థియేటర్స్ వరకు రావడం లేదు. చిన్న సినిమాలు అయినా పెద్ద సినిమాలో అయినా ఒకే తరహాలో చూస్తున్నారు.

కంటెంట్ కనెక్ట్ అయితేనే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి. అయితే కొన్నిసార్లు కంటెంట్ బాగున్నా కూడా ట్రెడ్ మాత్రం అసలు వర్కౌట్ కాకపోవడం నిజంగా ఒక మిస్టరీగానే మారిపోతుంది. రీసెంట్ గా దసరా సందర్భంగా విడుదలైన మూడు సినిమాలకు కూడా బాక్సాఫీస్ వద్ద ఒకే తరహా చేదు అనుభవాలు అయితే ఏర్పడ్డాయి.

గాడ్ ఫాదర్ సినిమా ఓపెనింగ్స్ అయితే బాగానే అందుకుంది. కానీ అది మెగాస్టార్ రేంజ్ కు తగ్గట్టుగా లేదు అనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆచార్య సైరా కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో కలెక్ట్ చేశాయి. మొదటి రోజు ఈ తరహా కలెక్షన్స్ అనేది కాస్త నిరాశపరిచే విషయం.

మరోవైపు నాగార్జున ది గోస్ట్ సినిమాకు అయితే మరింత తక్కువగా వచ్చాయి. బంగార్రాజు సినిమాతో మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి కానీ ఇప్పుడు దసరా సందర్భంగా మాత్రం నాగ్ సినిమాకు రేంజ్ కు తగ్గట్టుగా అయితే రాలేదు. ఒక విధంగా సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో రాత్రి షోలకు కలెక్షన్స్ తగ్గాయి.

ఇక స్వాతిముత్యం సినిమా కంటెంట్ బాగుందని కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని రివ్యూలు కూడా పాజిటివ్ గానే వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈ సినిమాకు పెద్దగా ఓపెనింగ్స్ అయితే రాలేదు. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ మూడు సినిమాలు కూడా ట్రేడ్ కు తగ్గట్టుగా అయితే వర్కౌట్ కాలేదు. దసరా ఫెస్టివల్ లో ఇలాంటి కలెక్షన్స్ రావడం అనేది కొంత భయాన్ని కలిగించే అంశమే. మరి రాబోయే ఫెస్టివల్ లో అసలైన సంక్రాంతికి సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News