స్టార్ డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ ప్రకటన అప్పట్లో ఎంత సంచలనమైందో తెలిసిందే. కోలీవుడ్ టాప్ స్టార్లని..అక్కడ బడా నిర్మాణ సంస్థల్ని అందర్నీ వదిలేసి తెలుగులో సినిమా చేయడం? ఏంటి అని అంతా కాస్త విస్మయానికి గురయ్యారు. చరణ్ తో ప్రకటన రావడం..ఆ చిత్రాన్ని అంతే వేగంగా సెట్స్ పైకి తీసుకెళ్లడం ఇప్పటికీ ఓ కలలాగే ఉంది.
సరిగ్గా ఈ సన్నివేశం `ఇండియన్ -2` షూటింగ్ మధ్యలో ఆగిపోయిన తర్వాత జరిగింది. ఇండియన్ -2 నిర్మాణం నిర్మాతలకు భారం అవ్వడం...శంకర్ బడ్జెట్ పెంచుకుంటూ పోతున్న వైనం తెరపైకి రావడంతోనే సినిమా మధ్యలో ఆగిపోయింది. ఈ సన్నివేశం శంకర్ ప్రతిష్టని కొంత వరకూ దెబ్బ తీసింది. వరల్డ్ వైడ్ శంకర్ కున్న ఇమేజ్..గుర్తింపు ఇండియన్-2 కారణంగా దెబ్బ తిందని అప్పట్లో మీడియా కథనాలు సైతం వేడెక్కించాయి.
ఆ కసితోనే శంకర్ టాలీవుడ్ కి రావడం...చరణ్ తో ప్రాజెక్ట్ ప్రకటించడం..ప్రారంభించడం అన్నిచాలా వేగంగానే జరిగిపోయాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న నానుడిని రివర్స్ చేయాలని చరణ్ తో ఇప్పుడు కసితో సినిమా చేస్తున్నారు శంకర్. చరణ్ కి భారీ హిట్ ఇచ్చి సత్తా చాటాలన్న కసి శంకర్ లో కనిపిస్తుంది. కాల క్రమంలో `ఇండియన్ -2` విషయంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.
కోర్టు కేసులు క్లియెరెన్స్ అవ్వడం సహా లైకా కి తోడుగా కొత్త సంస్థలు ముందుకు రావడంతో ఎట్టకేలకు ఇండియన్ -2 రీస్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతుంది. లైకాతో సన్ పిక్చర్స్ భాగస్వామ్యం అయినట్లు సమాచారం. చరణ్..కమల్ హాసన్ నటిస్తోన్న ఈ రెండు సినిమాలు రిలీజ్ అయి హిట్ అయితే శంకర్ ఇమేజ్ రెట్టింపు అవుతుంది. పాన్ వరల్డ్ లో ఆయన క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. హాలీవుడ్ లో సైతం సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు.
అందుకే తెలివిగా దిల్ రాజు సహా కొంత మంది నిర్మాతలు శంకర్ ని ఇప్పటి నుంచి లాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్- శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు ఓ చిత్రాన్ని శంకర్ తో తెరకెక్కించేలా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే కొన్ని బడా నిర్మాణ సంస్థలు సైతం శంకర్ కోసం కొలాబ్రేట్ అవుతున్నాయట.
రెండు..మూడు సంస్థలు అసోసియేట్ అయి శంకర్ కి ముందుగానే అడ్వాన్సులు చెల్లించి లాక్ చేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయట. శంకర్ తిరిగి కోలీవుడ్ కి వెంటనే వెళ్లిపోకుండా ఉండాలంటే? ఇదే సరైన చర్యగా భావించి కొంత మంది నిర్మాతలు అడ్వాన్స్ లతో లాక్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇదే నిజమైతే శంకర్ వెంట టాలీవుడ్ ఉన్నట్లే. కోలీవుడ్ కాస్త అశ్రద్ద చేసినా శంకర్ వెంట మేమున్నామంటూ ముందుకు రావడం విశేషమనే చెప్పాలి.
ప్రస్తుతం తెలుగు సినిమా స్పాన్ బాగా పెరిగింది. కోట్ల రూపాయలు నిర్మాణ వ్యయంగా కేటాయిస్తున్నారు. బాహుబలి..ఆర్ ఆర్ ఆర్ అంతకు మించిన గొప్ప సినిమాలు చేయాలన్న ఉత్సాహం తెలుగు నిర్మాతల్లో కనిపిస్తుంది. అలాంటి వారికి శంకర్ తోడైతే టాలీవుడ్ పాన్ వరల్డ్ కి రీచ్ అవ్వడం మరింత సులభం అవుతుంది. మరి శంకర్ మదిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో.