1996లో విడుదలైన తమిళ బ్లాక్ బస్టర్ సినిమా 'ఇండియన్'. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 'భారతీయుడు' పేరుతో తెలుగులో విడుదలై బ్రహ్మాండమైన హిట్ ని సొంతం చేసుకుంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. అవినీతి ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్ గా డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ హీరోగా 'ఇండియన్ 2' సినిమాను రూపొందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడైతే ప్లాన్ చేసారో అప్పటినుండి ఆటంకాలను ఎదుర్కొంటూనే ఉంది. ఈ సినిమాను ఒకదానివెంట మరో సమస్య వెంటాడుతూనే ఉన్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు అవాంతరాలు ఘోరంగా ఎదురవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో క్రేన్ విరిగిపడి ఘోరమైన ప్రమాదం వాటిల్లి ప్రాణనష్టం జరిగింది. ఆ ప్రమాదం నుండి కోలుకొని మళ్లీ షూటింగ్ ప్రారంభిద్దాం అనుకునేలోపు కరోనా వైరస్ కారణంగా షూటింగ్ నిలిపివేయడం జరిగింది. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ లో సినిమాను విడుదల చేస్తామని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. ఈ సినిమా ఎదుర్కొంటున్న ప్రమాదాల కారణంగా అసలు సినిమా పూర్తవుతుందా.. అనే ప్రశ్న సినీ వర్గాలలో, అభిమానులలో రేకెత్తుతోంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇన్ని అవాంతరాల మధ్య షూటింగ్ చేసే బదులు సినిమాను ఆపేస్తే బెటర్ అన్నట్లు కొందరు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఇండియన్-2 టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో..