టాప్ స్టోరి: స్టార్లు ల‌గ్జ‌రీ కార్లంటే ప‌డి చ‌స్తారేమి?

Update: 2021-10-14 10:30 GMT
కొంద‌రు స్టార్ల ఖ‌రీదైన అభిరుచి అభిమానుల్లో అన్నివేళ‌లా హాట్ టాపిక్. మార్కెట్లోకి ఏదైనా కొత్త‌గా వ‌చ్చినా.. అది బాగా న‌చ్చిందంటే ఇట్టే మ‌న‌సు పారేసుకుంటారు. వెనుకా ముందు ఆలోచించ‌కుండా దాన్ని చేజిక్కించుకోవాల‌నుకుంటారు. అదీ డ‌బ్బుకు చిక్కేది అయితే వెంట‌నే త‌మ క‌ళ్ల ముందు ఉండాల‌నుకుంటారు. ఆ కోరిక‌ను నెర‌వేర్చుకుంటారు. డ‌బ్బుంటే కొండ‌మీద కోతి అయినా దిగొస్తుంది అన్న నానుడి ఇక్క‌డ స‌రిగ్గా స‌రిపోతుంది.

అవును.. మెర్సిడెస్ మేబాచ్ జీ.ఎల్.ఎస్ -600 కారు పై ప‌లువురు బాలీవుడ్...టాలీవుడ్ స్టార్స్ మ‌న‌సు పారేసుకున్నారు. ఎలాగైనా ఆ ల‌గ్జ‌రీ కారులో తిరిగాల‌ని వెంట‌నే కొనుగోలు చేసి ఆ కోర్కెను తీర్చుకున్నారు. టాలీవుడ్ హీరోల‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్  ఈ కారును మొద‌ట‌గా ద‌క్కించుకున్నారు.

చ‌ర‌ణ్ కోసం ప్ర‌త్యేకంగా దీన్ని డిజైన్ చేయించుకున్నారు. అందుకోసం చ‌ర‌ణ్ నాలుగు కోట్లు ఖ‌ర్చు పెట్టారు. ఇప్ప‌టికే చెర్రీ వ‌ద్ద ఫెరారీ..బీఎమ్ డ‌బ్ల్యూ ఉన్నాయి. ఇక బాలీవుడ్  స్టార్ ర‌ణ‌వీర్ సింగ్ కి  కార్లు అంటే మ‌హా పిచ్చి. జులైలో లోనే మెర్సిడెస్ మేబాక్ ని కొనుగోలు చేసారు. ఇండియాలో లాంచ్ అయిన త‌ర్వాత నెల రోజుల్లోనే  ఈ కార్ కొన్న‌ మొద‌టి సెల‌బ్రిటీ ఇత‌నే. అలాగే ఈ  సెప్టెంబ‌ర్ లోనే మ‌రో బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్ ఈ ఖ‌రీదైన జ‌ర్మ‌నీ ఇంపోర్టెడ్ కారుని కొనుగోలు చేసారు. మ‌రోస్టార్ ఆయుష్మాన్ ఖురానా కూడా జులై లోనే మెర్సిడెస్ మేబాచ్  న్యూ మోడ‌ల్ కారుని కొన్నారు. కారులో అత్యాధునిక టెక్నాల‌జీ..ఫీచ‌ర్స్ బాగున్నాయి అన్న‌ది ఆయ‌న వ్య‌క్తిగత అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.

ఇక బాలీవుడ్ హీరోయిన్ల‌లో కృతి స‌న‌న్ కూడా ఇదే బ్రాండ్ కారును కొనుగోలు చేసింది. త‌న డ‌బ్బు తో తానే కొనుగోలు చేసిన ఈ బ్యూటీ `ఇది నాకు ఓ సెల్ఫ్ గిప్ట్ లాంటింది`` అని తెలిపింది. ఈ కార్ ని తాను అంత‌గా ఇష్ట‌ప‌డ‌తాన‌ని తెలిపింది. ఇంకా  మరికొంత మంది స్టార్ హీరో హీరోయిన్లు మెర్స్ డెస్ మేబాక్ కారును కొనుగోలు చేసారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోల్లో లంబోర్ఘీని పైనా మ‌న‌సు ఉంద‌ని నిరూపించారు. ఎన్టీఆర్.. రామ్ చర‌ణ్‌.. మ‌హేష్.. బ‌న్నీ లాంటి వారు ఈ కారును ఎంతో ఇష్ట‌ప‌డి కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. స్టార్లు ల‌గ్జ‌రీ కార్లంటే ప‌డి చ‌స్తారేమి? అంటే అందులో ఉండే ఫీచ‌ర్స్ వాటితో వ‌చ్చే సౌక‌ర్యాలే అన‌డంలో సందేహ‌మేం లేదు. ముఖ్యంగా సేఫ్లీ ఈరోజుల్లో కాస్ట్ లీ కార్ల‌తోనే పాజిబుల్ మ‌రి. వీట‌న్నిటినీ మించి స్టాట‌స్ సింబ‌ల్ గా భావించ‌డం కూడా మ‌రో ప్ర‌ధాన కార‌ణం.
Tags:    

Similar News