ఎఫ్ 2 కాస్త టఫ్ గానే ఉందే

Update: 2019-01-06 03:30 GMT
సంక్రాంతి అల్లుళ్ళ ట్యాగ్ తో కామెడీనే నమ్ముకుని వస్తున్న అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ ఎఫ్2 ఈ నెల 12 విడుదల కోసం ముస్తాబవుతోంది. ట్రైలర్ లేకుండా ఇప్పటిదాకా కేవలం ఆడియో ప్లస్ టీజర్ తోనే సరిపుచ్చారు. నిజానికి పోటీ పడుతున్న మూడు తెలుగు స్ట్రెయిట్ మూవీస్ లో కాస్త బజ్ తక్కువగా ఉన్నది ఎఫ్2కే. వెంకీకి గతంలో ఉన్న స్థాయిలో ఇప్పుడు స్ట్రాంగ్ మార్కెట్ లేదు. అయినా ఇందులో కంటెంట్ మెప్పించాలి అంటే తనే మీద ఎక్కువ భారం ఉందన్న సంగతి తెలిసిందే. మరోవైపు అంతరిక్షం డిజాస్టర్ తో వరుణ్ తేజ్ కూడా షాక్ తిని ఉన్నాడు. స్క్రీన్ షేరింగ్ కాబట్టి తనకు దీని వల్ల ఒరిగేది ఏమి లేదు.

దిల్ రాజు విషయానికి వస్తే గత ఏడాది మూడు పరాజయాలు చవిచూడటంతో ఇది మంచి బోణీ అవ్వాలని నమ్మకంతో ఉన్నారు. దీనికి పూర్తి స్క్రిప్ట్ రెడీ కాకుండానే అనిల్ రావిపూడి షూటింగ్ మొదలుపెట్టేసాడని దీని గురించే వెంకటేష్ కాస్త సీరియస్ అయినట్టుగా టాక్ వచ్చింది.ఇందులో నిజం ఉన్నా లేకపోయినా ప్రచారమైతే జోరుగా సాగింది.  ఇక పోటీగా ఉన్న వాటిలో ఎన్టీఆర్ కథానాయకుడు బజ్ ని చాలా తెలివిగా పెంచుకుంటూ పోతోంది. మహానటిని మించిన ఎమోషన్ ని ఇందులో చూడొచ్చని ఇప్పటికే ఇన్  సైడ్ టాక్ తో ఊరిస్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కథ కాబట్టి అధిక శాతం కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇక ఈ సీజన్ లోనే అత్యధిక బిజినెస్ జరుపుకున్న వినయ విధేయ రామ మాములు రచ్చ చేసేలా లేదు. ఎఫ్2 కన్నా ఒక రోజు ముందు వస్తున్న ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ కనక వస్తే దానికి ధీటుగా నిలిచి వసూళ్లు అందుకోవడం అంత ఈజీగా ఉండదు. అనిల్ రావిపూడి గత సినిమా రాజా ది గ్రేట్ యావరేజ్ కన్నా జస్ట్ ఒక మెట్టు పైన నిలిచింది కాని అతని ముందు రెండు సినిమాల స్థాయిలో వెళ్ళలేదు. సో ఎఫ్2 మీద ఇందరి జాతకాలు ఆధారపడ్డాయన్న మాట
Tags:    

Similar News