ట్రెండీ టాక్‌: బ‌జ్ లేదు..! అందుకేనా ఈ హ‌డావుడి?

Update: 2021-03-19 07:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కొంత గ్యాప్ త‌ర్వాత వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేనానిగా రాజ‌కీయాల్లోకి వెళ్లాక తిరిగి వ‌స్తూనే బాలీవుడ్ కోలీవుడ్ లో బంప‌ర్ హిట్ కొట్టిన క్రేజీ స‌బ్జెక్ట్ ని ఎంపిక చేసుకున్నారు. ఏప్రిల్ లో వ‌కీల్ సాబ్ రిలీజ‌వుతోంది. ప‌వ‌న్ కి ఇది ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన రీఎంట్రీ. అందుకే ప్ర‌చారం ప‌రంగానూ బోలెడంత హైప్ క్రియేట్ చేసేందుకు టీమ్ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది.

నిజానికి ఈ సినిమా ప్ర‌మోష‌న్ ప‌రంగా ఇప్ప‌టివ‌ర‌కూ చాలా వీక్ అన్న టాక్ ట్రేడ్ లో స్ప్రెడ్ అయ్యింది. అస‌లే బ‌జ్ క్రియేట్ అవ్వ‌డం లేదు.  ప‌వన్ క‌ల్యాణ్ కెరీర్ లోనే ఇంత త‌క్కువ బ‌జ్ ఇంకే సినిమాకి లేద‌న్న టాక్ వినిపించింది. అందుకే వ‌కీల్ సాబ్ ప్ర‌మోష‌న్స్ కోసం మేక‌ర్స్ ఒక‌టే హ‌డావుడి చేస్తున్నార‌న్న టాక్ ఇండ‌స్ట్రీ ఇన్ సైడ్ వినిపిస్తోంది. ఇక‌నైనా ప్ర‌తిదీ డిఫ‌రెంట్ గా ఉంటేనే బ‌జ్ క్రియేట‌వుతుంద‌ని నిర్మాత‌లు భావించి ప్ర‌మోష‌న్స్ ప్లాన్ ని ఛేంజ్ చేశార‌ట‌.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. వ‌కీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఏకంగా కోటి ఖ‌ర్చు చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దిల్ రాజు - బోనీ క‌పూర్ బృందం కేవ‌లం ఒక్క ఈవెంట్ కోసం అంత రిస్క్ చేయ‌డంపైనా ఇన్ సైడ్ గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. అంతేకాదు.. ప్రీరిలీజ్ వేదిక కోసం త‌‌మ్ముడి కోసం అన్న‌య్య‌ చిరంజీవి.. బాబాయ్ కోసం చెర్రీ ప్ర‌చార బ‌రిలో దిగుతున్నార‌ని తెలుస్తోంది.

వకీల్ సాబ్ ప్రీఈవెంట్ వేదిక‌పై మెగాస్టార్ చిరంజీవి- ప‌వ‌న్ క‌ల్యాణ్ - రామ్ చ‌ర‌ణ్ ఒకే ఫ్రేమ్ లో క‌నిపించి మెగాభిమానుల‌ను ఛీర‌ప్ చేస్తార‌ట‌. వేలాదిమంది మెగా ఫ్యాన్స్ ఈవెంట్ కి త‌ర‌లి వ‌స్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదేగాక బాలీవుడ్ నుంచి కిలాడీ అక్ష‌య్ కుమార్ ని ఈవెంట్ ముఖ్య అతిథిగా బ‌రిలో దించే అవ‌కాశం ఉంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే వీటికి సంబంధించిన అధికారిక స‌మాచారం వెల్ల‌డి కావాల్సి ఉంది. మొత్తానికి దిల్ రాజు బృందం చేస్తున్న హంగామా చూస్తుంటే .. ఎలాగైనా బ‌జ్ తేవాల‌న్న ప్ర‌య‌త్నం స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News