ట్రిపుల్ ఆర్ డేట్ వచ్చేసింది. రిలీజ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. కొత్త ఏడాది వస్తూనే భారీ విజువల్ ఫీస్ట్ ని సినీ జనం ముందు పెట్టేశాడు జక్కన్న. మూడేళ్ల ఆయన తపస్సు ఫలమది. అంతేనా అటు నందమూరి, ఇటు కొణిదెల వారసులను కలిపి అరుదైన ఫీట్ ని సాధించాడు.
గడచిన మూడు దశాబ్దాలుగా మల్టీ స్టారర్ మూవీస్ అంటే పెద్దగా ఏవీ రాలేదనే చెప్పాలి. ఎపుడో ఎర్లీ ఎయిటీస్ లో మాత్రమే వెల్లువలా ఇద్దరు హీరోల చిత్రాలు నిర్మాణం జరుపుకునేవి. దాంతో ట్రిపుల్ ఆర్ నే అచ్చమైన మల్టీ స్టారర్ అంటున్నారు అంతా. సమానమైన ఇమేజ్ కలిగిన ఇద్దరు హీరోలను బ్యాలన్స్ చేస్తూ సినిమా తీయడం కత్తి మీద సాము.
పైగా నందమూరి అభిమానులు ఒక వైపు, కొణిదెల ఫ్యాన్స్ ఇంకో వైపు మోహరించి ఉంటారు. ఇద్దరికీ అదిరిపోయే రేంజిలో మాస్ ఫాలోయింగ్ ఉంది. మరి దాన్ని ఎలా బ్యాలన్స్ చేయాలీ అంటే అది జక్కన్న ఒక్కడికే తెలుసు. ఆయన్నే ఆ కిటుకులు అడగాలి.
గతంలో మల్టీస్టారర్స్ తీసిన వారు కూడా ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేయలేక చతికిలపడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే జక్కన తెలివిగానే జూనియర్ ఎన్టీయార్ ని, రామ్ చరణ్ ని కలిపారని అంటున్నారు. స్క్రీన్ షేర్ విషయంలో కానీ పాత్రల ఫోకస్ విషయంలో కానీ ఎక్కడా ఇంచి కూడా తేడా లేకుండా చూసుకున్నారని టాక్.
ఇక లేటెస్ట్ గా వచ్చిన నాటు సాంగ్ లో చూసుకుంటే ఏ ఒక్కరూ తక్కువ కాదు అన్నట్లుగా ఇద్దరినీ కలిపి చూపించాడు. ఇక ఎన్టీయార్ రామ్ చరణ్ పాత్రలు కూడా పోటా పోటీగానే సాగుతాయట. ఏ హీరో ఫ్యాన్స్ కూడా ఎక్కడా హర్ట్ అవకుండానే రాజమౌళి పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాడని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఈ మల్టీస్టారర్ విషయంలో కూడా జక్కన్న రికార్డ్ క్రియేట్ చేశారని అంటున్నారు.
రేపటి రోజున ఎవరైనా మల్టీ స్టారర్ తీయాలనుకుంటే ట్రిపుల్ ఆర్ ఒక కొత్త పాఠంగా ఉంటుందని కూడా చెబుతున్నారు. మరి రిలీజ్ కాకుండానే ఇన్నేసి విశేషాలు అంచనాలతో హైప్ పెంచేస్తున్న ట్రిపుల్ ఆర్ పాత రికార్డులను బద్ధలు కొట్టడమే కాదు, కొత్త బెంచ్ మార్క్ నే నెలకొల్పుతుంది అంటున్నారు. సో అంతా వెయిట్ చేయాల్సిందే.