ఒకేసారి ఇద్దరు మెగాస్టార్స్‌ తో చేయబోతుంది

Update: 2019-12-07 11:14 GMT
త్రిష సౌత్‌ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసింది. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు త్రిష సినిమాలు చేస్తూనే ఉంది. పుష్కర కాలం పాటు ఈమె స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. కాని ఈమద్య కాస్త ఈమె జోరు తగ్గింది. ఇక త్రిష పనైపోయిందనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ పుంజుకుంది. రజినీకాంత్‌ సినిమాలో నటించడంతో మళ్లీ బిజీ అవుతుంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్రిషకు వరుసగా రెండు బిగ్‌ ప్రాజెక్ట్స్‌ దక్కినట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటికే చిరంజీవి 152వ చిత్రంలో ఒక హీరోయిన్‌ గా త్రిషను సంప్రదించారని.. చిరంజీవితో సినిమాకు త్రిష వెంటనే ఓకే చెప్పిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా షూటింగ్‌ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. చిరంజీవి 152వ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతుండగా రామ్‌ చరణ్‌ నిర్మించబోతున్నాడు. ఈ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక మెగాస్టార్‌ చిరంజీవితోనే కాకుండా మలయాళ మెగాస్టార్‌ మోహన్‌ లాల్‌ తో కూడా ఈ అమ్మడు నటించేందుకు రెడీ అవుతుందట. జీతూ జోషెఫ్‌ దర్శకత్వంలో మోహన్‌ లాల్‌ హీరోగా దృశ్యం చిత్రం వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో త్రిషను హీరోయిన్‌ గా ఎంపిక చేసినట్లుగా మలయాళ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఒకేసారి ఇద్దరు స్టార్‌ హీరోలతో ఈ అమ్మడికి నటించే అవకాశం రావడంతో మళ్లీ ఈమె బిజీ అయ్యే అవకాశం ఉందని ఆమె అభిమానులు అంటున్నారు.
Tags:    

Similar News