త్రివిక్రమ్ పేరు చెప్పినంతనే పవన్ గుర్తుకు వస్తాడు. వారిద్దరి మధ్య హీరో.. దర్శకుడు అన్న దానికి మించిన అనుబంధం ఉంది. వారిద్దరూ తమ వృత్తిపరమైన అంశాలకు అతీతమైన విషయాల్ని గంటల కొద్దీ మాట్లాడుకోవటం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై పలువురు చాలానే మాట్లాడుతుంటారు.
పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. ఆయనకు స్క్రిప్ట్ లు త్రివిక్రమ్ రాస్తుంటారని చెబుతుంటారు. అయితే.. అందులో ఏ మాత్రం నిజం లేదన్న విషయాన్ని త్రివిక్రమ్ గతంలో చెప్పారు. తాజాగా మీడియాతో ముచ్చట్లు చెప్పిన ఆయన.. తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.
తాను తన సినిమాలకు కథ రాయటానికే ఏడాది టైం తీసుకుంటానని.. అలాంటిది తనకు పవన్ కు స్క్రిప్ట్ లు రాయటానికి టైం ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. తామిద్దరం మంచి స్నేహితులమని.. అది మాత్రమే నిజమని.. తనకు పవన్ ఏమీ చెప్పరన్నారు.
పవన్ ఏం చేసినా తన అన్నయ్య చిరు.. ఇంట్లో వారికి కూడా చెప్పరని.. ఆయనేం చేసింది పక్కరోజు పేపర్లో చదివి తెలుసుకోవటమే తప్పించి.. ఇంకేమీ తెలీయవన్నారు. అయినా.. పవన్ కు తానేమి సలహాలు ఇస్తుంటాను చెప్పండి అంటూ ఎదురు ప్రశ్న వేశారు.
పవన్ రాజకీయ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఆయనకు స్క్రిప్ట్ లు రాసిస్తానని భలే బోనస్ ఇచ్చేస్తుంటారని.. కానీ తాను అలాంటివేమీ చేయనన్నారు ఆ మాటకు వస్తే తాను టీవీ ఛానళ్లు.. పేపర్ని అస్సలు చదవని స్పష్టం చేశారు.