సమంత-త్రివిక్రమ్‌.. రూమర్లు నిజమే

Update: 2016-05-03 07:44 GMT
నిన్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తన ''అ..ఆ'' సినిమా గురించి చెబుతూ.. ఒక మాటన్నాడు. ఏంటంటే.. ''ఈ సినిమాకోసం 30 రోజులు 40 రోజులు అనే లెక్క చూసుకోకుండా.. సమంత గారు ఎన్నిపడితే అన్ని ఎప్పుడు పడితే అప్పుడు కాల్‌ షీట్లు ఇచ్చారు. ధన్యోస్మి'' అంటూ చెప్పుకొచ్చాడు అకెళ్ళ నాగ శ్రీనివాస్‌ ఎలియాస్‌ త్రివిక్రమ్‌. అయితే ఈ విషయం చెప్పగానే అలనాటి నుండి పుట్టుకొచ్చిన కొన్ని రూమర్లకు సమాధానం దొరికేసింది.

నిజానికి చాలా సినిమాలను పక్కనెట్టేసి మరి ''అ..ఆ'' సినిమా అమ్మడు డేట్లు ఎలాట్‌ చేసిందంటే.. దాని వెనుక ఏదైనా కారణం ఉండి ఉండాలి. అప్పట్లో త్రివిక్రమ్‌ కొంతమంది సన్నిహితులతో చెప్పిన కొన్ని మాటలు.. రూమర్ల రూపంలో బయటకొచ్చాయి. తన తదుపరి సినిమాకు హీరోయిన్‌ గా సమంత ఫిక్స్‌.. హీరోను మాత్రం వెతుక్కోవాలి అని. పైగా ఇదో లేడీ ఓరియెంటెడ్‌ ఫిలిం అని.. అందుకే చాలామంది హీరోలు త్రివిక్రమ్‌ కు హ్యాండిస్తున్నారని కూడా టాక్‌ బయటకొచ్చింది. ఆ విషయం కూడా చెబుతూ.. ''ఈ సినిమాలో సమంత క్యారెక్టర్‌ పెద్దదా.. నితిన్‌ క్యారెక్టర్‌ పెద్దదా.. అనే కన్నా.. ఈ సినిమాలో కథే ఒక హీరో.. అందరికంటే కథ పెద్దది'' అని కూడా త్రివిక్రమ్‌ సెలవిచ్చాడు.

అంటే మనం విన్న రూమర్లు నిజమే అనమాట. ఇది సమంత లీడ్‌ లో నడిచే ఓ సినిమా. అందుకే అమ్మడు అన్నేసి కాల్‌ షీట్లు ఈ సినిమాకు ఇచ్చేసింది. అమ్మడు తనకు ఓ ''క్వీన్‌'' లాంటి సినిమా పడాలని ఎప్పటినుండో కలలు కంటోంది.. అది ఇదేనేమో.
Tags:    

Similar News