రంగుల ప్రపంచం వింతైనది. ఇక్కడ స్నేహాలు విచిత్రమైనవి. ఈ పురుషాధిక్య ప్రపంచంలో అడుగుపెట్టాలంటే మగువ ఎన్నో ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇదొక మాయావనం. ఈ వనంలో అడుగుపెడితే పంజరంలో చిక్కిన చిలకమ్మలా గిలగిలా కొట్టుకోవాల్సిందే. ఇక్కడ మనుగడ ఎంతో సాహసంతో కూడుకున్నది. ఆదుకునే గాడ్ ఫాదర్ ఉండాలి. అతడు ఏం చెబితే అది అనుసరించాలి. అప్పుడే అవకాశాలొస్తాయి. నేరుగా దర్శకనిర్మాతలతో స్నేహం చేయడం అందరికీ కుదరదు. అలాంటప్పుడు ప్రొడక్షన్ మేనేజర్లు - అసిస్టెంట్ డైరెక్టర్లు మొదలుకుని చివరికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతల వరకూ అందరితోనూ సత్సంబంధాలు నెరపాల్సిందే.
సరిగ్గా .. ఇదే పాయింట్ పార్టీలు - పబ్బులు - క్లబ్బుల వరకూ తీసుకెళ్తుంది. స్నేహంతో పార్టీలు కామన్. ఆ క్రమంలోనే పార్టీ వరకూ వెళితే ఏదో చివరిలో బిరియానీ తిని ఇంటికెళ్లిపోదాం! అనుకుంటే అస్సలు కుదరదు. నలుగురితో నారాయణ అంటూ సైడుకి తిరిగి ముక్కు మూసుకుని పెగ్గేయాల్సి ఉంటుంది. అక్కడ నోరూరిస్తూ కనిపించే కాస్ట్ లీ స్కాచ్ బాటిలో - వోడ్కా - జిన్నో కవ్వించడం ఖాయం. అరే వద్దు బాబూ.. నాకలవాటు లేదు! అని ఎస్కేప్ అయిపోదామంటే వదిలిపెట్టే ప్రపంచమా ఇది. ఇది మాయా ప్రపంచం. గమ్మత్తయిన ప్రపంచం. మత్తులోకి దించే కిక్కు వరల్డ్. అందుకే ఈ ప్రపంచంలో ఒకసారి పార్టీలకు అలవాటు పడితే ఇక ఏ నటి అయినా ఇక దానిని కొనసాగించాల్సిందే. తెలుగు సినిమా - టీవీ రంగంలో ఇలాంటి మగువలకు కొదవే లేదన్నది ప్రత్యక్ష సాక్ష్యుల కథనం.
సరదాగా సాయంత్రాలు కలవడాలు - ఆపై పెగ్గు వేయడం ఇక్కడ చాలా కామన్. సాటి నటుడితోనో - లేదా రైటర్ కం నిర్మాతలతోనో.. లేదా ఇంకెవరైనా స్నేహితులతోనో.. తప్పదిక్కడ. దస్ పల్లా - ఎఫ్ ఎన్ సీసీ - తాజ్ డెక్కన్ .. వంటి ఖరీదైన విలాసవంతమైన చోట్ల అప్పుడప్పుడు కొన్ని సీక్రెట్ పార్టీల్లో నటీమణులు సైలెంట్ గా పెగ్గు లేపేయడం ఎన్నో మార్లు జనం కళ్లబడడం చాలా కామన్. ఈ పార్టీలు - సక్సెస్ మీట్ లు వగైరా చోట్ల అయితే మరీ కామన్ ఇది. అప్పటివరకూ ఈవిడకు ఇలాంటి అలవాటు కూడా ఉందా? అని నోరెళ్లబెట్టేవాళ్లు ఉన్నా.. కొందరైతే కేవలం లోకల్ సరుకేం కర్మ.. కాస్తంత ఫారిన్ సరుకు ఉంటే పోయరూ! అని అడిగేస్తారు కూడా. ఇటీవలే ఓ యువహీరో సినిమా రిలీజ్ ముందు ఇచ్చిన పార్టీలో పలువురు టీవీ కం సినీ ఆర్టిస్టులు పెగ్గు మీద పెగ్గు లేపేయడం కుర్రాళ్ల కంట పడింది. బులుగు రంగు స్పెషల్ ఓడ్కాలో లైట్ గా సోడా మిక్స్ చేసి అటుపై కొలీగ్స్ తో కలిసి లాగించేయడం అందరూ చూశారు. కొందరైతే ఫ్రూట్స్ మిక్స్ చేసిన కాక్ టైల్ ని అంతే రంజుగా లాగించేశారు. ఈ మాయావనంలో - ఈ పార్టీ ప్రపంచంలో ఇలాంటివన్నీ మామూలే గురూ! అని సరిపెట్టుకున్నారు కానీ....!!?