క‌ర‌ణ్ జోహార్ ని బ్యాన్ చేయ‌మంటోంది

Update: 2022-05-27 10:32 GMT
క‌ర‌ణ్ జోహ‌ర్ పై అక్ష‌ర్ కుమార్ వైఫ్‌, న‌టి ట్వింకిల్ ఖ‌న్నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌ర‌ణ్ జోహార్ ని బ్యాన్ చేయాలంటోంది. వివ‌రాల్లోకి వెళితే.. మే 20న బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ త‌న 50 వ పుట్టిన రోజు వేడుక‌ల్ని ఘ‌నంగా జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ఈ పార్టీ చిన్ని సైజు అవార్డు ఫంక్ష‌న్ లా జ‌రిగింద‌ని బాలీవుడ్ మీడియా చెబుతోంది. బాలీవుడ్ లో ప్రైవేట్ పార్టీల‌కు క‌ర‌ణ్ జోహార్ పెట్టింది పేరు. బాలీవుడ్ లో పార్టీ ఇవ్వాలంటే ఆయ‌నే. గ‌తంలో బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు క‌ర‌ణ్ ఎన్నో పార్టీలిచ్చారు.

అందులో ఓ పార్టీకి సంబంధించిన వీడియో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి త‌రువాత వైర‌ల్ గా మారి క‌ర‌ణ్ ని ఇబ్బందుల‌కు గురిచేసిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఆ రేంజ్ కి మించి క‌ర‌ణ్ జోహార్ త‌న 50వ పుట్టిన రోజు వేడుక‌ల్ని ఘ‌నంగా బుధ‌వారం ముంబైలో జ‌రుపుకున్నారు.

ఈ లావీష్ పార్టీకి బాలీవుడ్ తార‌లంతా త‌ర‌లి వ‌చ్చారు. ఇటీవ‌ల పెళ్లైన విక్కీ కౌశ‌ల్ - క‌త్రినా జంట నుంచి బ్యాచిల‌ర్ గా వున్న త‌మ‌న్నా వ‌ర‌కు ప్ర‌తీ క్రేజీ స్టార్ ఈ పార్టీలో పాల్గొన్నారు.

అర్థ్రా రాత్రి వ‌ర‌కు మందు పార్టీల‌తో హ‌ల్ చ‌ల్ చేశారు. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు అంటూ చిందులేశారు. ఈ పార్టీలో క‌ర‌ణ్ జోహార్ తో క‌లిసి ర‌ణ్ వీర్ సింగ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ప‌బ్ స్టేజ్ పై నిల‌బ‌డి ఎవ‌ర్ గ్రీన్ హిట్ సాంగ్స్ కి ర‌ణ్ బీర్ చేసిన డ్యాన్స్‌.. ఆ డ్యాన్స్ కు క‌ర‌ణ్ జోహార్ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఆ త‌రువాత కాజోల్ తోనూ, క‌రీనాతోనూ క‌ర‌ణ్ డ్యాన్స్ చేస్తూ నానా హంగామా చేశాడు. ఈ పార్టీలో బాలీవుడ్ ఖిలాడీ అక్ష‌య్ కుమార్ ఆయ‌న స‌తీమ‌ణి, న‌టి ట్వింకిల్ ఖ‌న్నాతో క‌లిసి పాల్గొన్నారు.

అయితే ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేస్తూ హ్యాంగోవ‌ర్ కి గురిచేస్తున్న క‌ర‌ణ్ జోహార్ ని నిజంగా బ్యాన్ చేయాలంటూ ట్వింకిల్ ఖ‌న్నా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ‌న్నీగా కామెంట్ చేసింది. అంతే కాకుండా  స‌ల్మాన్ ఖాన్ న‌టింటిచిన కిక్ సినిమాలోని `హ్యాంగోవ‌ర్‌` పాట‌ని గుర్తు చేస్తూ ట్విస్ట్ ఇచ్చింది. అంతే కాకుండా `బ్యాన్ పార్టీస్‌, ఫ్రీ డ్రింక్స్ పార్టీస్ ని, క‌ర‌ణ్ జోహార్ ని బ్యాన్ చేయాలంటూ పోస్ట్ పెట్టి షాకిచ్చింది.

దీనికి హ్యాంగోవ‌ర్ తో త‌ల‌ప‌ట్టుకున్న త‌న ఫొటోని కూడా షేర్ చేసింది ట్వింకిల్ ఖ‌న్నా. అర్థ్ర‌రాత్రి వ‌ర‌కు జ‌రిగిన క‌ర‌ణ్ బ‌ర్త్ డే  పార్టీలో మందు తాగాన‌ని, ఆ హ్యాంగోవ‌ర్ పోవ‌డం లేద‌ని, ఇలాంటి పార్టీని ఏర్పాటు చేస్తున్న క‌ర‌ణ్ జోహార్ ని బ్యాన్ చేయాల్సిందేన‌ని వ్య‌గ్యంగా ఫొటోపై కామెంట్ చేసిన‌ ట్వింకిల్ ఖ‌న్నా పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News