ఆ రెండు ట్విస్టులేంటబ్బా?

Update: 2017-09-08 00:30 GMT
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా 'జై లవ కుశ'ను ఎట్టాగో టైముకే దించుతున్నారు. సెప్టెంబర్ 21న చెప్పినట్లే సినిమాను రిలీజ్ చేయబోతున్నారు కళ్యాణ్‌ రామ్ అండ్ కో. అయితే మొన్ననే ఆడియోను డైరక్టుగా మార్కెట్లోకి రిలీజ్ చేసేసినా కూడా.. ఇప్పుడు ట్రైలర్ ను మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం అట్టిపెట్టారంట. అయితే ఈ ట్రైలర్ కోసం ఓ రెండు మూడు వర్షన్లు మాత్రం తెగ్గొట్టినట్లు తెలుస్తోంది. ఎందుకలా?

నిజానికి జై లవ కుశ సినిమాలో మొదటి నుండి మనం విలన్ అనుకునే క్యారక్టర్ చివరకు హీరో అవ్వడం.. హీరో అనుకునేవాడు విలన్ అవ్వడం వంటి వినూత్న స్ర్కీన్ ప్లే ఏదో రాశారట కోన వెంకట్ వారు. దీనికి సంబంధించి మొదటి భాగంలో ఒక ట్విస్టు.. రెండో భాగంలో మరో ట్విస్టు ఉందట. ఈ ట్విస్టుల గురించి జనాలకు తెలియకుండా ఉండేలా ఒక ట్రైలర్ కట్ చేయిస్తే.. అది హీరో సాబ్ కు నచ్చలే. అలాగని తెలిసేలా కట్ చేస్తే అది ప్రొడ్యూసర్ సాబ్ కు నచ్చలే. అందుకే వీటికి మధ్యస్థంగా ఉండే ఒక కొత్త ట్రైలర్ ను కట్ చేశారటలే.

అయితే ఇలా సినిమాలో రెండు ట్విస్టులే మెయిన్ అని తెలిసిపోవడంతో.. అవి కాకుండా సినిమాలో ఏముంది అనే సందేహం జనరల్ గానే వస్తుంది. కాకపోతే ఇక్కడ మాత్రం.. అసలు ఆ రెండు ట్విస్టులు ఏంటి అంటూ కూడా అందరూ ఆలోచిస్తున్నారు. జై క్యారక్టర్ విలన్ కాదు హీరో అంటారా? అమాయకంగా ఉండే లవ క్యారక్టర్లో డార్క్ షేడ్ ఉందంటారా? లెటజ్ సీ.
Tags:    

Similar News