టాలీవుడ్ యువహీరో నితిన్, హీరోయిన్ కీర్తిసురేష్ నటించిన 'రంగ్ దే' సినిమా సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. మొత్తానికి సినిమా యు/ఎ సర్టిఫికేట్ పొందింది. అన్నిటికంటే ముందు మాట్లాడుకోవలసింది సినిమా రన్ టైం గురించి.. ఈ సినిమా నిడివి 2 గంటల 10 నిముషాలు ఉన్నట్లు సమాచారం. అయితే సెన్సార్ నివేదికలు తెలిపిన ప్రకారం.. రంగ్ దే మూవీ ఫస్ట్ హాఫ్ అంతా వినోదం మీద ఫోకస్ పెట్టిందని.. ఆ వినోదం అంతా సగం నితిన్, కీర్తిలపై నడుస్తుందని టాక్. ఇక ఫస్ట్ హాఫ్ ఎండింగ్ ముందు.. అంటే ఇంటర్వెల్ ముందు ఓ సర్ప్రైజ్ ఉందట. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో వినోదంతో పాటు సినిమాకు అసలు కథాంశం అయిన బలమైన ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ముఖ్యంగా ఈ సినిమాలో బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సుహాస్, నరేష్ ల కామెడీ సన్నివేశాలు బాగున్నాయని సెన్సార్ తెలిపింది.
చివరిగా సెకండ్ హాఫ్ లో దుబాయ్ ఎపిసోడ్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ భావోద్వేగంగా ఉన్నాయని తెలిపినట్లు ఇండస్ట్రీ టాక్. అలాగే ఈ సినిమాకు అసలు ప్లస్ అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. ఈ సినిమాలో పాటలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రంగ్ దే ఫస్ట్ హాఫ్ లో మంచి సాంగ్స్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయట. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన మూడో సినిమా ఇది. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాల తర్వాత రంగ్ దే తెరకెక్కించాడు. ఇప్పటికే ట్రైలర్ ప్రేక్షకులలో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ఫేమ్ సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. చెక్ సినిమా ప్లాప్ తర్వాత నితిన్ నుండి వస్తున్న సినిమా ఇది. చూడాలి మరి మార్చ్ 26న రంగ్ దే ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో!