టెలివిజన్ యాంకర్ గా ఉండి.. హాట్ నెస్ పంచడం ఇప్పుడు బాగానే నడుస్తోంది. ముఖ్యంగా అనసూయ.. రేష్మిల తర్వాత ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. కానీ వీరికంటే ముందే.. హాట్ యాంకర్ అనిపించుకున్న బ్యూటీ ఉదయభాను. యాంకరింగ్.. ఈవెంట్స్ ను హోస్ట్ చేయడం.. లైవ్ షోలు చేయడమే కాదు.. సినిమాల్లో కూడా ఐటెం సాంగ్స్ తో సత్తా చాటింది ఉదయభాను.
కొన్ని నెలలుగా పూర్తిగా కుటుంబానికే వెచ్చించేసింది ఉదయభాను. ఇందుకు కారణం.. పెళ్లయిన దశాబ్దం తర్వాత.. పిల్లల కోసం ప్లానింగ్ చేసుకోవడమే. 2004లో కన్ స్ట్రక్షన్ వ్యాపారి విజయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్న ఈ యాంకర్ కు.. ఇప్పుడు పిల్లలు పుట్టారు. అది కూడా ట్విన్స్ కావడం.. ఇద్దరూ ఆడపిల్లలు కావడం మరీ విశేషంగా చెప్పాలి. గతేడాది ఆగస్ట్ 28నే ఉదయభాను ఈ ఇద్దరికీ జన్మనిచ్చింది. కానీ ఇప్పటివరకూ వారి ఫోటోలను బయటపెట్టలేదు.
తాజాగా ఉదయభాను కవల పిల్లల ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ ఈ ఇద్దరు పిల్లల పేర్లు ఏంటో తెలుసా?.. యువి నక్షత్ర.. భూమి ఆరాధ్య.. ఇవే ఆ చిన్నారుల ఇద్దరి పేర్లు. ప్రస్తుతం తన సమయం అంతా పిల్లల కోసమే కేటాయిస్తోంది ఉదయభాను. తాను సాధించిన అన్ని విజయాల కంటే.. కవల పిల్లలే అతి పెద్ద విషయం అంటోందిట ఉదయభాను.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/