మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఇటీవల సోషల్ మీడియాల ద్వారా ఎన్నో ఎమోషనల్ ఘట్టాలను ప్రస్థావిస్తూ ప్రతిదీ అభిమానులకు చేరవేస్తున్నారు. ముఖ్యంగా మాతృత్వంలోకి అడుగుపెడుతున్న వేళ తన ఆనందాలను తన ప్రణాళికలను బహిరంగంగా వెల్లడిస్తున్నారు. మాతృత్వ భావనలనే కాదు.. పిల్లల్ని ఏవిధంగా పెంచాలి? అనే విషయంలో తన ధృక్పథాన్ని కూడా దాచకుండా ముచ్చటిస్తున్నారు.
తాజాగా ఉపాసన తన బేబి బంప్ ఫోటోని షేర్ చేసి దానికి ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. ఈ వ్యాఖ్యానం సారాంశం ఇలా ఉంది. ``అన్ని సరైన కారణాల కోసం నేను మాతృత్వాన్ని స్వీకరించడానికి గర్వపడుతున్నాను. నేను సమాజం అంచనాలకు అనుగుణంగా లేదా అంచనాలకు సరిపోయేలా నేను ఇలా చేయడం లేదు. తల్లి కావాలనే నా నిర్ణయం వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికతో లేదా నా వివాహాన్ని బలోపేతం చేయాలనే కోరికతో తీసుకున్నది కానేకాదు. నా బిడ్డ (ఆడ లేదా మగ) శ్రేయస్సు కోసం మేం అన్నివిధాలా అర్హులమయ్యాక.. ప్రేమ & సంరక్షణను అందించడానికి మానసికంగా సిద్ధమయ్యాక నేను బిడ్డను కనాలని భావించాను`` అని తెలిపారు. నా మొదటి #మదర్స్ డే జరుపుకుంటున్నానని నేటి (14 మే) `మదర్స్ డే` సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.
నిజానికి ఉపాసనకు మీడియా నుంచి సోషల్ మీడియా వ్యక్తుల నుంచి ఎదురయ్యే మొదటి ప్రశ్న పిల్లల్ని కనేదెప్పుడు? అని! ఈ ప్రశ్నను పదే పదే ఎదుర్కొన్నారు. ప్రతిసారీ తాము పిల్లల్ని కనేందుకు మానసికంగా సిద్ధపడాల్సి ఉందని.. తాము జీవితంలో అనుకున్న విధంగా సెటిల్ కాలేదని కూడా వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. తాము అన్నిరకాలుగా సిద్ధమయ్యాకే పిల్లల్ని కంటామని కూడా ఉపాసన వివరణ ఇచ్చారు. దాదాపు పెళ్లయిన పదేళ్లకు తొలి సంతానం నట్టింట అడుగుపెడుతున్న వేళ ఉపాసన సహా మెగా కుటుంబసభ్యులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. ఎట్టకేలకు తాము పిల్లల్ని కోరుకున్న విధంగా ప్రణాళికా బద్ధంగా పెంచుతామనే భావన కలిగాకే ఉపాసన తొలి బిడ్డకు జన్మనిచ్చేందుకు మానసికంగా సిద్ధమయ్యారని అర్థమవుతోంది.
స్వదేశంలోనే తొలి ప్రసవం..
ఇటీవలే భారతదేశంలో తమ బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని ఉపాసన చెప్పారు. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్ చరణ్ కనిపించిన తర్వాత బిడ్డ అమెరికాలో పుడుతుంది అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ దానిపై ఉపాసన వెంటనే క్లారిటీనిచ్చారు. ``స్వదేశంలో మా మొదటి బిడ్డను ప్రసవించేందుకు నేను సంతోషిస్తున్నాను - భారతదేశంలో ప్రపంచ స్థాయి వైద్య OB/GYN బృందం అపోలో హాస్పిటల్స్ లో ఉంది. వీరిలో డాక్టర్ సుమనా మనోహర్- డాక్టర్ రూమా సిన్హా ఉన్నారు`` అని ఉపాసన తెలిపారు. అపోలో హెల్త్ మ్యాగజైన్ అధిపతిగా .. అపోలో గ్రూప్స్ బోర్డ్ మెంబర్ గా ఉపాసన అత్యున్నత స్థాయి బాధ్యతలను నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఉపాసన అపోలో హాస్పిటల్స్ లో CSR వైస్ చైర్ పర్సన్ గా ఉన్నారు.