డిఫెక్టెడ్ కండోమ్స్ తో చేసిన దుస్తులు ధరించిన మెగా కోడలు...!

Update: 2020-05-20 06:30 GMT
కొణిదెల వారి కోడలుగా.. రామ్ చరణ్ సతీమణిగా ఉపాసనను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఎప్పుడో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అపోలో హాస్పిటల్స్ యాజమాన్య బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ఉపాసన జనాలకు మంచి సందేశాలతో తనదైన పాత్ర పోషిస్తూ ముందుకు వెళుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలదని చాలాసార్లు నిరూపించుకుంది. ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎప్పుడూ ముందే ఉంటుంది. డిజిటల్ స్పేస్ యూట్యూబ్ వేదికగా హెల్త్ రిలేటెడ్ వీడియోలు చేస్తూ.. హెల్త్ టిప్స్ ఇస్తూ తనదైన గుర్తింపు పొందుతున్నారు. ఏ విషయాన్నైనా నిర్భయంగా బిడియం లేకుండా చెప్పే వ్యక్తులలో ఉపాసన కొణిదల ఒకరని చెప్పవచ్చు. ఇంతకముందు మన పాతకాల పద్ధతిలో టాయిలెట్ పోజిషన్ ఉపయోగిస్తే చాలా మేలు జరుగుతుందని.. ఆ పొజిషన్ లో కూర్చొని మరీ చూపించింది. ఇప్పుడు మరో డేరింగ్ స్టెప్ తో ముందుకొచ్చారు ఉపాసన. ఈసారి దుస్తుల విషయంలో ఒక కొత్త ఐడియాతో వచ్చింది.

లోకల్ డిజైనర్లు రిజెక్ట్ చేసిన టెక్స్‌ టైల్ స్క్రాప్‌ మరియు డిఫెక్టెడ్ కండోమ్స్ తో తయారు చేసిన దుస్తులను ధరించింది. ఇలా ఎవరైనా ఉపాసనలా దైర్యంగా ధరించగలరా అని ఆశ్చర్యం వ్యక్తం చేయకమానరు. టెక్స్‌ టైల్ స్క్రాప్‌ తో తయారు చేసిన టాప్ మరియు కండోమ్స్ తో తయారు చేసిన కస్టమ్ రబ్బరు స్కర్ట్ ధరించిన ఫోటో ఒకటి పోస్ట్ చేసింది ఉపాసన. దీని గురించి ఉపాసన ట్వీట్ చేస్తూ.. ''సస్టైనబుల్ ఫ్యాషన్ అనేది ఫ్యూచర్! స్క్రాప్ ధరించడానికి ధైర్యం ఉందా..? స్థానిక డిజైనర్ల నుండి రిజెక్ట్ చేయబడిన ఆర్గాన్జా టాప్ టెక్స్‌ టైల్ స్క్రాప్‌ ల నుండి తయారు చేయబడింది. స్కర్ట్ కూడా వేస్ట్ డిఫెక్టెడ్ కండోమ్స్ తో చేయబడింది'' అని పేర్కొన్నారు. దీనికి మెగా ఫ్యాన్స్ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. 'వదినా నువ్వు సూపర్ అసలు. నిజంగా ఎంత డేర్ ఉంటే ఇలాంటివి ట్రై చేస్తారు. మీ గట్స్ కి హాట్స్ ఆఫ్' అని కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా ఉపాసన ఫేక్ డిగ్నిటీ మైంటైన్ చేయకుండా ఇలా కొత్త కొత్త ఆలోచనలతో బయటకు రావడం తో అందరూ ఆమెను అభినందిస్తున్నారు.
Tags:    

Similar News