టాలీవుడ్ హీరో నాని కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమా ''జెర్సీ''. నటుడిగా నాని ని మరో మెట్టు ఎక్కించిన చిత్రమిది. 2019లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినా, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంది.
'జెర్సీ' చిత్రాన్ని హిందీలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరినే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. తెలుగు నిర్మాతలైన అల్లు అరవింద్ - దిల్ రాజు - సూర్యదేవర నాగవంశీ - బన్నీ వాసు ఈ సినిమాని నిర్మించడం మరో విశేషం.
కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన హిందీ 'జెర్సీ' సినిమా ఎట్టకేలకు నిన్న శుక్రవారం (ఏప్రిల్ 22) థియేటర్లలోకి వచ్చింది. అయితే తొలి రోజు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మాతృక దర్శకుడు రీమేక్ చేసినప్పటికీ సానుకూల రివ్యూలను సాధించలేకపోయింది.
కథ విషయానికొస్తే.. అర్జున్ తల్వార్ (షాహిద్ కపూర్) చండీగఢ్ కు చెందిన మాజీ రంజీ ఆటగాడు. అతను తన భార్య (మృణాల్ ఠాకూర్) సంపాదన మీద ఆధారపడుతూ.. కొడుకుతో కలిసి నిరుత్సాహకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే కొన్ని సంఘటనల తర్వాత తన కొడుకు కోసం అర్జున్ తిరిగి క్రికెట్ ను తన జీవితంలోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
కాకపోతే అర్జున్ కి అప్పటికే 36 ఏళ్లు దాటిపోయాయి. అయినా సరే క్రికెట్ బ్యాట్ పట్టుకోవాలని డిసైడైన అర్జున్ కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఈసారైనా తన లక్ష్యాన్ని సాధించాడా లేదా? అనేదే 'జెర్సీ' సినిమా కథ. స్పోర్ట్స్ డ్రామాలు హిందీ జనాలకు కొత్తకాదు. అయితే దీన్ని ఎమోషన్ ఫ్యామిలీ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా తీర్చిదిద్దారు.
తెలుగు 'జెర్సీ'లో నాని తన పాత్రను ఎంతో సమర్థవంతంగా పోషించగా.. ఇప్పుడు షాహిద్ కపూర్ సైతం తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. మృణాల్ ఠాకూర్ పరిధి మేరకు నటించగా.. కొడుకు కరణ్ పాత్రలో రోణిత్ అలరించాడు. నిజజీవితంలో షాహిద్ తండ్రి అయిన పంకజ్ కపూర్.. ఇందులో కోచ్ గా ఆకట్టుకున్నారు.
'జెర్సీ' సినిమాని హిందీలోనూ తెరకెక్కించే ఛాన్స్ లభించినప్పటికీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి పెద్దగా ఉపయగించుకోలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీన్ టూ సీన్ రీమేక్ చేయకుండా.. హిందీ నేటివిటీకి అనుగుణంగా కొన్ని అంశాలను మారిస్తే బాగుండేదని అంటున్నారు.
ఒరిజినల్ లో డ్రామా బాగా పండింది. కానీ రీమేక్ విషయానికి వస్తే, ఎక్కడో ఆత్మ తప్పిపోయింది. దర్శకుడు తన కథ మరియు నటీనటుల పెర్ఫార్మన్స్ లతో ప్రభావం చూపినప్పటికీ.. హిందీలో డ్రామా ప్రేక్షకులకు కనెక్ట్ అవలేదనే కామెంట్స్ వస్తున్నాయి.
అనిత్ మెహతా సినిమాటోగ్రఫీ మరియు అనిరుధ్ రవిచంద్రన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కథకు తగిన విధంగా ఉండగా.. సచేత్-పరంపర పాటలు ఆశించిన స్థాయిలో జనాల్లోకి వెళ్ళలేదు. నత్తనడకలా సాగే కొన్ని సన్నివేశాలు.. సెకండాఫ్ లో క్రికెట్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేదని తెలుస్తుంది.
బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి 'జెర్సీ' చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. పలువురు విమర్శకులు ఈ చిత్రాన్ని ప్రశంసించగా... మరికొందరు అంతగా ఆకట్టుకోలేకపోయిందని పేర్కొంటున్నారు. హిందీ రీమేక్ లో తాజాదనం లోపించిందని అభిప్రాయ పడ్డారు.
"జెర్సీ ఒక జిరాక్స్ కాపీ లాంటిది. ఒరిజినల్ దానితో సమానంగా ఉంటుంది.. కాకపోతే కలర్ - సోల్ తక్కువగా ఉంటుంది. నాని 'జెర్సీ'ని ఆరాధించేవారికి.., ఈ జెర్సీ తగినంత ఫ్రెష్ గా అనిపించదు.. తగినంత ఉత్తేజాన్ని కలిగించదు" అని బాలీవుడ్ విమర్శకురాలు పేర్కొన్నారు. తరుణ్ ఆదర్శ్ సైతం ఈ సినిమాకు యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. ఇలాంటి రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి వసూళ్ళు రాబడుతుందో చూడాలి.