మెగాస్టార్ చిరంజీవి నుంచి దాదాపు మూడేళ్ల విరామం తరువాత థియేటర్లలోకొచ్చిన మూవీ 'ఆచార్య'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీలో చిరుతో కలిసి రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇద్దరు క్రేజీ స్టార్ లు నటించడంతో ఈ మూవీ మెగా అభిమానులకు ఓ సెలబ్రేషన్ ల వుంటుందని అంతా భావించారు కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోగా చిరు కెరీర్ లోనే అత్యంత భారీ డిజాస్టర్ గా నిలవడంతో మెగా ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు.
త్వరలో మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' మూవీతో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్నా అభిమానుల్లో ఇంకా 'ఆచార్య' క్రియేట్ చేసిన భయాలు అలాగే వున్నాయి. ఈ మూవీ ఇచ్చిన షాక్ తో చిరుతో పాటు ఫ్యాన్స్ కూడా ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఇదిలా వుంటే 'ఆచార్య' తరువాత చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీతో దసరాకు సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. మలయాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు.
మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. గత సినిమాలకు పూర్తి భిన్నమైన మేకోవర్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చిరు కనిపిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరుకు ఇందులో హీరోయిన్ లేదు. దీంతో ఆయన మార్కు మెరుపులు ఇందులో వుంటాయా?.. వుండవా? అనే అనుమానాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. అయితే సల్మాన్ ఖాన్ తో కలిసి చిరుపై ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో చిత్రీకరించిన పార్టీ సాంగ్ ఆ లోటుని తీరుస్తుందని చెబుతున్నారు.
ఇదిలా వుంటే దసరాకు ప్రేక్షకుల ముందుకు భారీ స్థాయిలో కానున్న ఈ మూవీ రిలీజ్ కు సరిగ్గా 30 రోజులు మాత్రమే వున్నాయి. అయినా టీమ్ నుంచి ఎలాంటి సందడి.. హడావిడీ కనిపించడం లేదు. ఇక రీసెంట్ గా విడుదల చేసిన టీజర్, అందులో సల్మాన్ ని చూపించిన తీరు, తమన్ నేపథ్య సంగీతంపై సోసల్ మీడియా వేదికగా కామెంట్ లు వినిపించాయి.
దీంతో ఫ్యాన్స్ లో మరింత ఆందోళన మొదలైంది. అంతే కాకుండా రీసెంట్ గా విడుదలైన కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్' ట్రైలర్ 'గాడ్ ఫాదర్'ని మించి ఎట్రాక్ట్ చేయడం, సినిమాలో ఏదో కొత్త పాయింట్ వుందనే ఆసక్తిని రేకెత్తించడంతో మెగా ఫ్యాన్స్ మరింతగా ఫీలవుతున్నారట.
రీమేక్ సినిమా అయి వుండి కూడా టీజర్ తో ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయలేకపోయారని కంగారు పడుతున్నారట. ట్రైలర్ విషయంలో అయినా మేకర్స్ తగు జాగ్రత్తలు తీసుకుని ఆశించిన బజ్ ని క్రియేట్ చేస్తారని ఆశిస్తున్నారట. అంతే కాకుండా ప్రమోషన్స్ కి కేవలం నెల రోజులు మాత్రమే వుండటంతో 'గాడ్ ఫాదర్' టీమ్ ఇప్పటికైనా జోరు పెంచాల్సిందే అంటూ కామెంట్ లు చేస్తున్నారట. మోహన్ రాజా, అండ్ సూపర్ గుడ్ ఫిలింస్ ఫ్యాన్స్ మొర ఆలకిస్తారా? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.