ఏజెంట్ టీజ‌ర్.. పాన్ ఇండియా స్పై ఆప‌రేష‌న్

Update: 2022-07-11 05:37 GMT
అక్కినేని అఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'ఏజెంట్' పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల కానుందా? అంటే ఇప్ప‌టివ‌ర‌కూ దీనికి స్ప‌ష్ట‌మైన జ‌వాబు లేదు. కానీ ఇప్పుడు అన్నివిధాలా క్లారిటీ వ‌చ్చేసింది. ఏజెంట్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. ఈ సినిమా టీజర్ ను జూలై 15న అన్ని భాషల్లో (తెలుగు-హిందీ-త‌మిళం-క‌న్న‌డం-మ‌ల‌యాళం వెర్ష‌న్లలో) విడుదల చేయనుండ‌డం దీనికి సంకేతం.

తెలుగు మార్కెట్ త‌ర్వాత ఏజెంట్ ఆప‌రేష‌న్ పూర్తిగా హిందీ మార్కెట్ పైనే అనేది కూడా ఈ ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్ట‌మైంది. తాజా అధికారిక ప్ర‌క‌ట‌న అఖిల్ అభిమానుల‌లో వేడి పెంచుతోంది. టీజ‌ర్ విడుద‌ల త‌ర్వాత యావ‌త్ యువ‌భార‌తం ఏజెంట్ కోసం సెర్చ్ చేయడం ఖాయ‌మ‌న్న చ‌ర్చా సాగుతోంది.

అఖిల్ ని మ్యాకోమ్యాన్ గా చూపించేందుకు.. గూఢ‌చారిగా అత‌డిని హాలీవుడ్ రేంజులో ఆవిష్క‌రించేందుకు సురేంద‌ర్ రెడ్డి ఎంత‌గానో త‌పిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఏజెంట్ లో యాక్షన్‌ సన్నివేశాలు సంచ‌నాల బార్న్ సిరీస్ రేంజులో ఉంటాయ‌ని కూడా అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి.

ఏజెంట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్. మంచు కొండ‌ల్లో పోర్ట్ ప‌రిస‌రాల్లో.. ప‌చ్చ‌ని అడ‌వుల్లో.. కొండ కోన‌ల్లో అద్భుత‌మైన లొకేషన్ల‌లో ఏజెంట్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. విజువ‌ల్ బ్రిలియ‌న్సీ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ఈ సినిమా మేకింగ్ కోసం భారీగా బ‌డ్జెట్ల‌ను ఖ‌ర్చు చేసారన్న టాక్ వినిపిస్తోంది.

అఖిల్ మొదటి సారిగా త‌న కెరీర్ ఉత్త‌మ‌ యాక్షన్ సినిమాలో న‌టిస్తున్నాడు. దాని కోసం శ‌రీరాకృతిని అసాధార‌ణంగా మ‌లిచాడు. అత‌డి 6 ప్యాక్ అవ‌తార్ అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా ఉంటుంది. ఇప్ప‌టికే రిలీజైన ఫోటోల్లో అఖిల్ మాన్ స్ట‌ర్ లుక్ తో బీస్ట్ లుక్ తో షాకిచ్చాడు.

అఖిల్ మేకోవ‌ర్ పై పెద్ద చ‌ర్చా సాగింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ సినిమాలో అఖిల్ సరసన సఖి వైద్య క‌థానాయిక‌గా  నటిస్తోంది.  ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థలో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News