దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు 'పఠాన్'. ఐదేళ్లు గ్యాప్ ఇచ్చి మరీ ఆకలితో ఉన్న సింహంలో బాక్సాఫీస్పై దూకి సంచలనం సృష్టించారు. విడుదలైన వారం రోజుల్లో రూ.700కోట్ల రూపాయలను వసూలు చేసి బాలీవుడ్కు వెలుగులను తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రం ఇంతటి స్థాయిలో గ్రాండ్గా హిట్ అవ్వడానికి కారణం వెనకున్న పేరు సిద్ధార్థ్ ఆనంద్. బాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్గా మారారు. 'బ్యాంగ్ బ్యాంగ్', 'వార్' వంటి యాక్షన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2004లో హమ్ హమ్ చిత్రంతో రైటర్గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత సలామ్ నమస్తే చిత్రంతో డైరెక్టర్గా మారారు. అనంతరం తారా రమ్ పమ్, బచ్న యే హసీనో, అంజనా అంజని వంటి చిత్రాలను రూపొందించారు. ఈ క్రమంలోనే బ్యాంగ్, వార్తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇకపోతే రీసెంట్గా పఠాన్తో సంచలనం సృష్టించే సరికి ఆయన కొత్త ప్రాజెక్ట్లపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆయన హృతిక్తో మళ్లీ ఫైటర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పఠాన్ సక్సెస్తో తెరపైకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు వచ్చి ఇండియన్ ఇండస్ట్రీని హోరెత్తించింది. ఎందుకంటే వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ గత కొద్ది కాలంగా వచ్చిన ప్రచారం అధికారికంగా కన్ఫామ్ అయింది.
మైత్రీ మూవీస్ అధినేత నవిన్ యెర్నెనీ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌ను కలసి శుభాకాంక్షలు చెప్పి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఇకపోతే ఈ చిత్రంలో హృతిక్ కూడా ఉంటారని ప్రచారం వస్తోంది. దాదాపు రూ.1500కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలిసింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇండియన్ హిస్టరీలోనే ఇంత భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న తొలి సినిమా ఇదే అవుతుంది.
మరి జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలతాడా? ఇప్పటి వరకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన సినిమాలు చూస్తే అత్యధికంగా రూ. 500కోట్ల బడ్జెట్ వరకు ఉంటుందనే చెప్పాలి. మరి ప్రభాస్తో చేయబోయే సినిమా కోసం ఏకంగా రూ.1500కోట్లు వెచ్చిస్తారనే ప్రచారం సాగుతుంది. 1500కోట్లు దానికి తగ్గట్లు కథతో పాటు విజువల్స్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, యాక్షన్స్ సీక్వెన్స్ అన్ని మరింత గ్రాండ్గా ఉండాలి. మరి వాటిన్నింటినీ సిద్ధార్థ్ సక్సెస్ఫుల్గా ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి. ఏదేమైనప్పటికీ అంతా అనుకున్నట్టే ప్రభాస్-సిద్ధార్థ్ చిత్రం తెరపైకి వచ్చి సూపర్ హిట్గా నిలుస్తే మాత్రం అటు ప్రభాస్ పేరుతో పాటు ఇక సిద్ధార్థ్ ఆనంద్ పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుందనే చెప్పాలి.
ఇక రెమ్యునరేషన్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు బాహుబలి ప్రభాస్ రూ.150 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆయన మార్కెట్ చూసి అంత మొత్తంలో ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రభాస్ సినిమాకు దర్శకత్వం వహించబోయే సిద్ధార్థ్ ఆనంద్ కూడా అంతే మొత్తం డిమాండ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఇంత ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారో లేదో.
సెట్స్పైకి అప్పుడే.. సిద్ధార్థ్ ప్రస్తుతం హృతిక్ రోషన్ కథానాయకుడిగా 'ఫైటర్' చేయబోతున్నారు. ఇందులోనూ దీపికా పదుకొణె కథానాయిక. ఈ సినిమా తర్వాతే ప్రభాస్ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది. మరోవైపు ప్రభాస్ కూడా మూడు నాలుగు భారీ సినిమాలు ఉన్నాయి. వీటిలో 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ కె', సహా మరో సినిమా సెట్స్ మీద ఉన్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇవన్నీ పూర్తి అయితేనే సిద్ధార్థ్ సినిమా షురూ అవుతుంది. అంటే 'ఫైటర్' పూర్తయ్యేలోపు ప్రభాస్ మూడు చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.