దిల్ రాజు నెవ్వర్ బిఫోర్ లైనప్

Update: 2023-04-13 09:58 GMT
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా లెవల్ లో లేదంటే స్టార్ హీరోలతోనే ఉంటాయని గతంలోనే దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఇక లో బడ్జెట్ నుంచి మినిమమ్ రేంజ్ ప్రాజెక్ట్స్ కోసం దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే మరో బ్యానర్ ని స్టార్ట్ చేశారు. దిల్ రాజు కూతురు ఈ బ్యానర్ లో నిర్మాతగా ఉంటోంది.

ఈ బ్యానర్ 2 నుంచి బలగం సినిమాతో మొదటి సక్సెస్ ని దిల్ రాజు అందుకున్నారు. ఇదిలా ఉంటే మెయిన్ ప్రొడక్షన్ నుంచి మాత్రం దిల్ రాజు వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలని లైన్ లో పెట్టారు. ప్రస్తుతం శాకుంతలం సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే రామ్ చరణ్, శంకర్ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ దశలో ఉంది.

మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా జటాయు ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో క్యాస్టింగ్ ఫైనల్ కాకున్నా స్టార్ హీరోతోనే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో పౌరాణికం కథాంశంతో పాన్ ఇండియా సినిమా ఉంది. అలాగే రజినీకాంత్ హీరోగా బాబీ లేదా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు.

పాన్ ఇది పాన్ ఇండియా సినిమాగానే వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్. మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయడానికి దిల్ రాజు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 తర్వాత సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోయే సినిమాని దిల్ రాజు నిర్మించనున్నారు.

అలాగే బాలకృష్ణ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటోంది అనే టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా గీతాగోవిందం 2 కూడా రెడీ అవుతోంది. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలలో చాలా వరకు వంద కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కనున్న  సినిమాలే కావడం విశేషం.

Similar News