యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'విక్రమ్'. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ మూవీని అత్యంత పవర్ ఫుల్ గా తెరకెక్కించారు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ యాక్షన్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ ని సెట్ చేసింది. విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
కొన్నేళ్ల క్రితం కమల్ నటించిన 'విక్రమ్' మూవీకి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ వసూల్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. సినిమా క్లైమాక్స్ లో చివరి ఐదు నిమిషాల పాటు కీలక పాత్రలో రోలెక్స్ గా నటించి హీరో సూర్య షాకిచ్చారు.
అనిరుధ్ బీజిఎమ్స్ ఇప్పటికీ సినీ లవర్స్‌ని, స్టార్ హీరోలని హంట్ చేస్తోంది. ఆర్థికంగా కూడా కమల్ ని భారీ లాభాల బాటలో నడిపించిన ఈ మూవీ ఫలితం ఆయనకు అన్ని రకాలుగా సంతృప్తిని కలిగించింది.
గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో వున్న కమల్ ని ఈ మూవీ ఒక్కసారిగా ఒడ్డున పడేసి ఆయనతో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ మూవీ సక్సెస్ తో మంచి జోష్ మీదున్న కమల్ హాసన్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. వెంటనే శంకర్ తో చేస్తున్న 'ఇండియన్ 2'ని పట్టాలెక్కించడానికి రెడీ అయిపోతున్నారు. 'విక్రమ్' ప్రయోషన్స్ లో భాగంగా 'ఇండియన్ 2' పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కమల్ ఈ మూవీ బ్యాలెన్స్ షూటింగ్ ని వెంటనే ప్రారంభించాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఈ మూవీలోని ఓల్డ్ గెటప్ కోసం, ఆ మేకోవర్ కోసం కమల్ హాసన్ యుఎస్ వెళుతున్నారట. 3 వారాలు పాటు అక్కడే వుండి సినిమాకు తగ్గట్టుగా ఫిజిక్‌ని మార్చుకుని ఇండియా తిరిగి రానున్నారట. ఆ తరువాతే షూటింగ్ మొదలు పెట్టనున్నారట. ప్రస్తుతం శంకర్ మెగా హీరో రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే 'ఇండియన్ 2'ని పట్టాలెక్కిస్తారట. ఇందు కోసం లైకా వర్గాలు కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
కరోనాకు ముందు సెట్ లో క్రేన్ విరిగిపడి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన నలుగు సభ్యుల చనిపోవడంతో అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తరువాత లైకా వర్గాలతో దర్శకుడు శంకర్ కు మధ్య విభేధాలు తలెత్తడంతో ఈ మూవీ షూటింగ్ ని అర్థాంతరంగా నిలిపివేశారు. తిరిగి కమల్ చర్చలు జరపడంతో మళ్లీ ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయబోతున్నారు.