కార్తీ మరో సూపర్ కాంబో ఫిక్స్..!

Update: 2023-01-05 11:30 GMT
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ కెరీర్ మంచి దూకుడు మీద ఉన్నాడు. లాస్ట్ ఇయర్ పిఎస్ 1, సర్ధార్ రెండు సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న కార్తీ తన నెక్స్ట్ సినిమా జపాన్ అంటూ ఒక క్రేజీ మూవీతో రాబోతున్నాడు. రాజు మురుగన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు. ఇక ఈ సినిమా తర్వాత కార్తీ సూపర్ డీలక్స్ రైటర్ నలన్ కుమార స్వామి  తో సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

రైటర్ గా డైరెక్టర్ గా దూసుకెళ్తున్న నలన్ కుమారస్వామి ఓ అద్భుతమైన కథతో కార్తీని కలిశాడట . కథ నచ్చిన కార్తీ వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సూపర్ డీలక్స్ రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నలన్ కుమారస్వామి 2020లో కుట్టి స్టోరీ అనే ఆంథాలజీ సినిమాని డైరెక్ట్ చేశారు. ఇక కొద్దిపాటి గ్యాప్ తో ఒక సూపర్ స్టోరీని రెడీ చేసుకుని కార్తీతో సినిమాకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 20 నుంచే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.

విభిన్న కథలతో హీరో కార్తీ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్నారు. కార్తీ సినిమా అంటే కచ్చితంగా కథ డిఫరెంట్ గా ఉంటుంది అన్న నమ్మకం కుదిరేలా చేశాడు. తప్పకుండా నలన్ కుమారస్వామి సినిమాతో కూడా కార్తీ ప్రేక్షకులను మెప్పిస్తాడని చెప్పొచ్చు. కార్తీ కెరీర్ లో జపాన్ 25వ సినిమా కాగా కుమారస్వామితో చేసే సినిమా 26వ సినిమాగా వస్తుంది.

ఈ ఇయర్ ఆల్రెడీ పి.ఎస్ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కార్తీ ఆ సినిమాలో తన పోర్షన్ తో మరోసారి అదరగొట్టాలని చూస్తున్నాడు. ఓ పక్క స్టార్ డైరెక్టర్ లతో పనిచేస్తూ యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నాడు కార్తీ. కార్తీకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. తన సినిమాలన్ని ఇక్కడ కూడా మంచి వసూళ్లు రాబడుతున్నాయి. సర్ధార్ సినిమా తెలుగులో కూడా హిట్ అయ్యింది.  




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News