5 రోజుల్లో రూ.300 కోట్లు.. దూసుకెళుతున్నా పీఎస్ 1

Update: 2022-10-06 04:34 GMT
భారీ అంచనాలతో విడుదలైన 'పొన్నియిన్ సెల్వన్ 1'.. అంచనాలకు తగ్గట్లే దూసుకెళుతోంది. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం వసూళ్ల పరంగానూ తగ్గేదేలే.. అన్నట్లు ఉంది. వెయ్యేళ్ల క్రితం జరిగిన చరిత్రను కళ్లకు కట్టినట్లుగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు మణిరత్నం.

ప్రముఖ రచయిత కల్కి రాసిని పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. పది భాగాలున్న ఈ పుస్తకాన్ని రెండు భాగాల్లో సినిమాను పూర్తి చేసే క్రమంలో భాగంగా పీఎస్ 1 విడుదలైంది.

లైకా ప్రొడక్షన్స్.. మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ చిత్రం సెప్టెంబరు 30న తమిళం.. తెలుగు.. కన్నడ.. మలయాళ.. హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమా విడుదలైన రోజున మిక్సైడ్ టాక్ వచ్చి.. తుది ఫలితం మీద సందేహాలు వ్యక్తమయ్యేలా చేసినా.. రెండో రోజు నాటికి పెరిగిన కలెక్షన్ల జోరు సినిమా కెపాసిటీ ఏ స్థాయిదన్న విషయాన్ని స్పష్టం చేసింది.

విడుదలైన ఐదు రోజుల్లో ఏకంగా రూ.300 కోట్ల మార్కును దాటేసిన ఈ చిత్రం విజయవంతంగా దూసుకెళుతోంది. ఒక్క తమిళనాడు లోనే ఈ మూవీ రూ.100కోట్ల మార్కు దాటేసింది.

మణిరత్నం తన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా పీఎస్ 1 నిలుస్తుంది.  ఇటీవల కాలంలో ఆయన నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటలేకపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్న వేళ.. వాటికి చెక్ చెప్పేలా పీఎస్1 ఉందని చెప్పాలి.

పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్టు షురూ చేసినప్పటి నుంచి  ఈ మూవీని బాహుబలితో పోల్చటం తెలిసిందే. అయితే.. ఆ సినిమా కలెక్షన్ల తో పోలిస్తే అంత జోరు ఉంటుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో పాన్ ఇండియా మూవీలుగా విడుదలైన భారీ కలెక్షన్లు రాబట్టిన బాహుబలి 2, కేఎఫ్ సీ 2 కంటే కాస్త తక్కువ జోరును ప్రదర్శిస్తున్న పీఎస్ 1.. వసూళ్ల పరంగా తన లక్ష్యానికి తగ్గట్లే ముందుకెళుతుందన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News