ఓటీటీల వేళ.. పీఎస్ 1కు మాత్రమే సాధ్యమైన మేజిక్

Update: 2022-10-10 11:30 GMT
ఇప్పుడు నడుస్తున్నదంతా ఓటీటీల కాలం. వేలాది సినిమాలు ఇంట్లోనే కూర్చొని చూసే వీలున్న పరిస్థితి. అలాంటివేళలో.. ఇంటిని విడిచి వందల రూపాయిలు ఖర్చు పెట్టి సినిమాను చూసేందుకు థియేటర్ కు వెళ్లటం అంత చిన్న విషయం ఏమీ కాదు. కట్టి పడేసే కథనం.. వెండితెర మీదనే చూడాలన్నట్లుగా ఉండే గ్రాండ్ నెస్.. రోటీన్ కు భిన్నమైన స్టోరీస్ తోనే సినిమాను థియేటర్ లో చూసేందుకు ప్రేక్షకుడు ఇష్టపడుతున్నాడు. ఇదే కాదు.. గతంలో ఒక సినిమాను అదే పనిగా రిపీటెడ్ గా చూసే అలవాటు బాగా తగ్గిపోయింది.

ఒకవేళ సినిమా బాగా నచ్చితే.. ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూసే ధోరణి ఎక్కువైందే తప్పించి.. సినిమా థియేటర్ కు మళ్లీ వెళ్లి చూసేంత మాత్రం ఇప్పుడు లేని పరిస్థితి. రిపీట్ ఆడియన్స్ అన్నది స్టార్ హీరోల సినిమాలకు సాధ్యం కావట్లేదు.

ఈ కారణంతో సినిమా ఏ మాత్రం బాగోలేదంటే.. దాని దరిదాపుల్లోకి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. గతంతో పోలిస్తే వర్తమానంలో కాలం విలువ మరింత పెరగటం.. బాగోలేని దాని కోసం నాలుగైదు గంటలు ఎందుకు వేస్ట్ చేయాలన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇలాంటి పరిమితుల గోడల్ని బద్ధలు కొట్టేసింది పొన్నియిన్ సెల్వం -1.

వెయ్యేళ్ల క్రితం నాటి చోళ సామ్రాజ్యం గురించి వచ్చిన చారిత్రక నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించటం తెలిసిందే. ఈ సినిమా స్పెషల్ ఏమంటే.. భారీ తారాగణం. ఒకరికి మించిన ఒకరు అన్నట్లుగా నటనతో థియేటర్లో కూర్చొని సినిమా చూసే వారికి పండుగ మాదిరి మారిన పరిస్థితి. అయితే.. ఈ సినిమాను చూసేటప్పుడు వచ్చే చిక్కు.. నెగిటివ్ అనుకుంటే అదే ఇప్పుడు పాజిటివ్ అంశంగా మారింది.

సినిమా సాగుతున్న కొద్దీ వచ్చే పాత్రలు.. వాటి పేర్లు.. వారికి మిగిలిన వారితో ఉండే లింకులు ఒక పట్టాన అర్థం కావు. కానీ.. అర్థమవుతున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. దీనికి తోడు ఐశ్వర్యారాయ్.. త్రిషలకు వాడిన జ్యుయులరీ మీద భారీ ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. గ్రాండ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ మూవీని చూసినంతనే కలిగే ఫీలింగ్ ఏమంటే.. మరోసారి చూస్తే.. మరింత ఎంజాయ్ చేయొచ్చని.

దీనికి కారణం.. ఇంతకు ముందే చెప్పిన అంశాలే. దీంతో.. ఇటీవల కాలంలో కనిపించని రిపీటెడ్ ఆడియన్స్ ఈ సినిమాకు వస్తున్నారు. వారి సంఖ్య తక్కువే ఉండొచ్చు. కానీ.. ఇటీవల కాలంలో సినిమాను చూసేందుకే థియేటర్ కు రాని వేళలో.. పొన్నియిన్ సెల్వం మూవీని మరోసారి చసేందుకు.. తమకు అర్థమైన పాత్రల్ని మరింతగా అర్థం చేసుకోవటానికి.. సినిమాను మరింత ఎంజాయ్ చేయటానికి రెండోసారి చూస్తే ఆ కిక్కే వేరేగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ఇదే.. పీఎస్ కు కొత్త బలంగా మారినట్లుగా చెబుతున్నారు. అంతకంతకూ పెరుగుతున్న వసూళ్లు కూడా ఇవే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.




దాదాపు అల్లు అర్జున్ ఫైనల్ కథను వినిపించినట్లుగా తెలుస్తోంది. బన్నీకే కథ నచ్చడంతో తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమా చేయాలి అని ఆలోచనతో ఉన్నాడట.
Tags:    

Similar News