సూపర్ స్టార్ మహేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'ఎస్ ఎస్ ఎంబీ 28'వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే రెగ్యులర షూటింగ్ మొదలైంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇందులో మహేష్ సహా ప్రధాన పాత్ర ధారులపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి వైరల్ అవుతోంది.
ఇందులో మహేష్ సాప్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నారుట. ఆ పాత్రని ఆధ్యంతం ఆసక్తికరంగా మలుస్తున్నట్లు సమాచారం. ఓ వైపు మహేష్ ని సాప్ట్ గా చూపిస్తూనే..మరోవైపు అతగాడి ఇమేమ్ కి ఏ మాత్రం తగ్గకుండా త్ రివిక్రమ్ మార్క్ యాక్షన్ ఎలివేషన్ లోనూ తనదైన మార్క్ కనిపిస్తుందని సమాచారం. మహేష్ ని తనదైన శైలిలో వెండి తెరపై ఆవిష్కరించబోతున్నారని తొలి షెడ్యూల్ తోనే క్లారిటీ వస్తుంది.
త్రివిక్రమ్ ఎంత క్లాస్ స్టోరీ తీసుకున్నా? అభిమానులు మెచ్చే సన్నివేశాలు తప్పనిసరిగా జొప్పిస్తారు. వాటిని అంతే అందంగా..స్టైలిష్ గా చూపించడం కేవలం ఆయనకు మాత్రమే చెల్లింది. మహేష్ ఇమేజ్ రెట్టింపు అయిన నేపథ్యంలో ఇప్పుడు మరింత ఇన్నోవేటివ్ గా..స్టైలిష్ గా ఆవిష్కరించడానికి ఛాన్స్ ఉంది.
తొలి షెడ్యూల్ లో యాక్షన్ పార్ట్ షూట చేసిన త్రివిక్రమ్ రెండవ షెడ్యూల్ లో కుటుంబ నేపథ్యంలో సాగే సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ పూజాహెగ్డే కూడా జాయిన్ అవుతుందిట. ఈనెల 15 నుంచి రెండవ షెడ్యూల్ ప్రారంభమవుతుందని సమాచారం. మహేష్ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా నటించడం ఇదే తొలిసారి.
గతంలో 'మహర్షి' చిత్రంలో సాప్ట్ వేర్ కంపెనీ సీఈవో పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఇక త్రివిక్రమ్ హీరోల్ని సాప్ట్ వేర్ ఇంజనీర్లగా చూపించడం కొత్తేం కాదు. గతంలో పలు సినిమాల్లో ఆయన హీరోలు ఐటీ నిపుణులే. అదే కోవలో మరోసారి మహేష్ ని సాప్ట్ గా సాప్ట్ వేర్ ఇంజనీర్ గా మార్చేసారు.
ప్రస్తుతం మహేష్ కుటుంబ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయన తల్లి ఇందిరాదేవి స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ ఆ పనుల్లో ఉన్నారు. కర్మకాండ కార్యక్రమాలు పూర్తయ్యే వరకూ మహేష్ ఇల్లు కదలడానికి లేదు. ఐదవ రోజు తల్లి అస్తికల్ని హరిద్వార్ వద్ద గంగానదిలో మహేష్ స్వయంగా నిమజ్జనం చేసిన సంగతి తెలిసిందే. ఇంకా పదకొండవ రోజు కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. అవన్ని పూర్తయిన తర్వాత రెండు..మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. అటుపై షూట్ కి వచ్చే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.