టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నిన్న శుక్రవారం అర డజనుకు పైగా సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చాయి. అందులో "బనారస్" చిత్రం కూడా ఒకటి. కర్నాటక రాజకీయవేత్త జమీర్ అహ్మద్ ఖాన్ కొడుకు జైద్ ఖాన్ ను హీరోగా లాంచ్ చేసిన సినిమా ఇది. జయతీర్థ దర్శకత్వంలో తెరకెక్కింది.
ఇటీవల కాలంలో పలు కన్నడ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన నేపథ్యంలో.. 'బనారస్' సినిమాని తెలుగు హిందీ తమిళ మలయాళ భాషల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. మిగతా భాషల సంగతేమో కానీ.. తెలుగులో ఈ చిత్రాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావడం.. హోమ్ ప్రొడక్షన్ లోని సినిమా కావటంతో భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు. ప్రేక్షకులను ఎప్పుడూ ఎగ్జైట్ చేసే టైమ్ లూప్ కాన్సెప్ట్ తో "బనారస్" చిత్రాన్ని రూపొందించారు. అయితే తెర మీద అంతే ఎగ్జైటింగ్ గా ఆవిష్కరించడంలో విఫలం అయ్యారు.
హీరో చేసిన పొరపాటు వల్ల అతను లవ్ చేసిన హీరోయిన్ బనారస్ వెళ్ళిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ అక్కడికి వెళ్లిన అతనికి టైం లూప్ వల్ల జరిగిన సంఘటనలే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ఇలా ఎందుకు జరుగు తోంది? దాన్నుంచి ఎలా బయట పడ్డారు? అనేది మిగతా కథ.
నిజానికి సోషల్ ఫాంటసీ జోనర్ లో టైమ్ ట్రావెల్ లేదా టైమ్ లూప్ అనేది ప్రత్యేకమైన కాన్సెప్ట్. తెలుగులో "ఆదిత్య 369" సినిమా దగ్గర నుంచి ఇటీవలి "బింబిసార" వరకూ అనేక సినిమాలు ఇదే థీమ్ తో వచ్చి బాక్సాఫీసు వద్ద మంచి హిట్లు అందుకున్నాయి. అయితే "బనారస్" మూవీ మాత్రం ఈ జాబితాలో చేరలేకపోయిందని తెలుస్తోంది.
ఈ మధ్య టైమ్ లూప్ - టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమాలు చాలా వచ్చాయి. 'ప్లే బ్యాక్' మరియు తేజ సజ్జా 'అద్భుతం' చిత్రాలు ఓటీటీలో విశేష ఆదరణ దక్కించుకున్నాయి. అలానే వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన 'మానాడు' మూవీ కూడా ఓటీటీలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆడియన్స్ ను అలరించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని సురేష్ బాబు తెలుగులో రీమేక్ చేస్తున్నారు కూడా.
ఇదే క్రమంలో శర్వానంద్ "ఒకే ఒక జీవితం" అనే ఎమోషనల్ టైం ట్రావెల్ చిత్రంతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తోనే "బింబిసార" సినిమా చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆహా ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ సిరీస్ "కుడి ఎడమైతే" కూడా టైం లూప్ థీమ్ తో రూపొందిందే.
ఇలా గత రెండేళ్లలో ఇదే జోనర్ లో వచ్చిన సినిమాలు - వెబ్ సిరీసులు ప్రేక్షకాదరణ పొందాయి అంటే.. ఇది హిట్టు ఫార్ములా అనే చెప్పాలి. అవన్నీ మంచి కథ - ఆడియన్స్ ను ఎగ్జైట్ చేసే ఆసక్తికరమైన కథనంతో వచ్చిన సినిమాలు. ఇక్కడ "బనారస్" సినిమా విషయంలో ఆ అంశాలే మిస్ అయ్యాయని అంటున్నారు.
కొన్ని ట్విస్టుల మినహాయించి.. మిగిలినదంతా రిపీట్ మోడ్ లో నడిపించడంతో.. సినిమా చాలా బోరింగ్ సాగింది. తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం.. ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటీనటులు ఒక్కరు కూడా లేకపోవడంతో "బనారస్" సినిమా జనాలను ఆకర్షించలేకపోయింది. దీనికి తోడు ఇప్పుడు టాక్ ఆశించిన విధంగా లేదు. మరి ఈ వీకెండ్ లో ఏ మేరకు వసూళ్ళు రాబడుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.