క్యారెక్టర్ ఆర్టిస్టుగా మలయాళ నటి ఊర్వశికి దక్షిణాదిలో బాగానే గుర్తింపు ఉంది. ప్రస్తుతం సినిమాలతోపాటు సీరియల్స్ కూడా నటిస్తోంది. అయితే, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఈ మధ్యనే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను పంచుకున్నారు. తన మొదటి భర్తతో వైవాహిక జీవితం ఎంత దుర్భరంగా గడిచిందో గుర్తు చేసుకుంది ఊర్వశి. తనకు తాగుడు అలవాటు చేసిందీ తొలి భర్తే అనీ - ఆయన దగ్గర ఉన్నంతకాలం నరకం అంటే ఏమిటో నిత్యం చూస్తూనే ఉండేదాన్ననని ఆవేదన వ్యక్తం చేసింది.
మలయాళ నటుడు మనోజ్ కె. జయన్ తో ఊర్వశి వివాహం 2000లో జరిగింది. ‘పెళ్లయ్యాకగానీ తెలియలేదు... అతడు ఎలాంటివాడో, ఎంతటి శాడిస్టో’ అని వివరించింది. తన మాజీ భర్త కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లో కూర్చుని తాగుతూ ఉండేవారని, తనకు కూడా బలవంతంగా తాగుడు అలవాటు చేశారని ఊర్వశి వాపోయింది. పెళ్లయిన రెండు నెలలకే తనను డబ్బు తెమ్మనీ, సినిమాల్లో నటించమని బలవంతం పెట్టేవారని ఊర్వశి చెప్పింది. అంతకుముందు తనకు మద్యం సేవించడం అలవాటు లేదని అంటోంది. తన బిడ్డ విషయంలో కూడా భర్త వల్లనే ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చిందని చెప్తోంది. మనోజ్- ఊర్వశిలకు పుట్టిన ఒక కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం ఆమె తండ్రి మనోజ్ దగ్గరే ఉంటోంది. 2008లో మనోజ్ నుంచి ఊర్వశి విడాకులు తీసుకుంది. అయితే, విడాకులు తీసుకునేందుకు తప్పతాగి కోర్టుకు హాజరై అభాసుపాలైంది. తన తాగుడు వ్యసనానికి కారణం భర్తే అని చెబుతోంది.
ఊర్వశితో విడాకుల తరువాత మనోజ్ వేరే పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఊర్వశి కూడా శివప్రసాద్ అనే కాంట్రాక్టరును రెండో పెళ్లి చేసుకుంది. శివప్రసాద్ నిర్మాణ రంగంలో కాంట్రాక్టర్. చాలాయేళ్లుగా ఊర్వశి కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారట. దీంతో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో అతడిని రెండోపెళ్లి చేసుకున్నట్టు ఊర్వశి చెప్పింది. చిత్రం ఏంటంటే... తన తండ్రి మనోజ్ ఇంట్లో ఎప్పుడూ తాగలేదనీ, ఆయనకు ఆ అలవాటే లేదని ఊర్వశి కుమార్తె చెప్పడం! మా అమ్మ ఎప్పుడూ తాగుతూనే ఉంటుందనీ, అందుకే ఆమెతో తాను ఉండటం లేదని ట్విస్ట్ ఇచ్చింది. ఊర్వశి పాయింటాఫ్ వ్యూ నుంచి చూస్తే... ఆమె తొలి భర్త వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంది! మద్యానికి బానిసైంది. చివరికి, కన్న కూతురు నుంచి కూడా దూరంగా ఉండాల్సి వస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/