కొత్త దర్శకులు, రచయితలను ఆహ్వానిస్తున్న యూవి కాన్సెప్ట్స్..!

Update: 2021-03-04 12:38 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ నిర్మాణ సంస్థలలో ఒకటి యూవి క్రియేషన్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో ఈ యూవి క్రియేషన్స్ బ్యానర్ ప్రారంభం అయింది. 2013లో మిర్చి విడుదలైంది. అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా యూవి క్రియేషన్స్ బ్యానర్ పై పలు సక్సెస్ ఫుల్ మూవీస్ రూపొందించబడ్డాయి. అయితే యూవి క్రియేషన్స్ బ్యానర్ అధినేతలు ముగ్గురు. వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి. ఈ ముగ్గురు తమ బ్యానర్ పై ఇప్పటివరకు పలు విజయవంతమైన సినిమాలను నిర్మించారు. వరుస విజయాలలో ఉన్న ఈ సంస్థ ప్రస్తుతం అగ్రనిర్మాణ సంస్థగా ఫేమ్ తెచ్చుకుంది. ఈ బ్యానర్ పై ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్ని గమనిస్తే అర్ధమవుతుంది.. వారు కథకోసం మార్కెట్ తో సంబంధం లేకుండా బడ్జెట్ విషయంలో వెనకడుగు వేయకుండా క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారని. ఆ విధంగానే ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు యూవి క్రియేషన్స్ వారు.

అయితే ఫస్ట్ నుండి కూడా యూవి బ్యానర్ కొత్త టాలెంట్స్ ఎంకరేజ్ చేస్తూ వస్తోంది. తాజాగా పూర్తిగా యంగ్ టాలెంట్స్ అందరికి కూడా అవకాశం ఇవ్వడానికి.. యువత టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి యూవి అనుబంధ సంస్థగా యూవి కాన్సెప్ట్స్ అనే బ్యానర్ రూపొందించారు. ఈ బ్యానర్ పై మంచి జనాలకు బాగా నచ్చే కాన్సెప్ట్ లను తెరకేక్కిస్తూ.. నూతన దర్శకులకు, రచయితలకు, నటులకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే పలు చిన్నపాటి బడ్జెట్ లో విడుదలకు రెడీ అవుతున్నాయట. మంచి కాన్సెప్ట్ ఉంటే గనక ఎలాంటి వారికైనా అవకాశం ఇవ్వడానికి రెడీ అంటోంది యూవి కాన్సెప్ట్స్. సినిమా అంటే ఫ్యాష‌న్‌, డెడికేష‌న్ కలిగిన ఏ టెక్నిషియ‌న్ కైనా ఈ యువి కాన్సెప్ట్స్ తో భాగ‌స్వామ్యం కావచ్చు. ఇదిలా ఉండగా.. ఈ కొత్తగా ప్రారంభించిన ఈ బ్యాన‌ర్లో నిర్మించిన ఓ సినిమా అప్డేట్ మార్చ్ 5న సోషల్ మీడియాలో విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ప్రతిభ కలిగిన ఎలాంటి వారికైనా ఇదొక మంచి ప్లాట్ ఫామ్ అంటూ కితాబులిచ్చేస్తున్నారు సినీప్రముఖులు. చూడాలి మరి ఫస్ట్ మూవీ అప్డేట్ ఎలా ఉండబోతుందో!


Tags:    

Similar News