క్రిష్ - వైష్ణవ్ తేజ్ కాంబోలో కొత్త సినిమా షురూ...!

Update: 2020-08-14 06:36 GMT
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ సోదరుడుగా 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండానే నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసాడు వైష్ణవ్ తేజ్. వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా నేడు పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో వైష్ణవ్ కి జోడీగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. రాజీవ్ రెడ్డి మరియు జాగర్లమూడి సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి అక్టోబర్ ఎండింగ్ వరకు సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ని నవంబర్ ఫస్ట్ వీక్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని సమాచారం.

ఇదిలా ఉండగా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా 'ఉప్పెన' ఇప్పటికే కంప్లీట్ అయింది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావించగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాతో కృతీ శెట్టి హీరోయిన్‌ గా టాలీవుడ్‌ కు పరిచయమవుతోంది. టాలెంటెడ్ యాక్టర్ 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక 'ఉప్పెన' సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.


Tags:    

Similar News