ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ బయోపిక్ లు హాట్ టాపిక్ లుగా మారిన సంగతి తెలిసిందే. వాటిలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెరకెక్కించబోతోన్న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాపై లక్ష్మీ పార్వతి అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత జీవితాన్ని వక్రీకరించి సినిమాను రూపొందిస్తే తాను కోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధమని ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రంలో హీరోయిన్ వాణీ విశ్వనాథ్ నటిస్తోందన్న పుకార్లు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా, ఆ పుకార్లపై వాణీ విశ్వనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఆ చిత్రంలో నటించనమని తనకు ఆఫర్ వచ్చిన మాట నిజమేనని తెలిపారు. అయితే, ఆ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే, అన్నీ కుదిరితే ఎన్టీఆర్ సతీమణిగా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆమె మీడియాతో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
త్వరలో టీడీపీలో చేరతానని వాణీ విశ్వనాథ్ కొద్ది రోజుల క్రితం ప్రకటించన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రిలో కనకదుర్గను దర్శించుకున్న సందర్భంగా టీడీపీలో తన చేరికపై మరింత స్పష్టతనిచ్చారు. రేపు సీఎం చంద్రబాబు గారిని కలుస్తానని ఆమె చెప్పారు. చంద్రబాబుగారి నాయకత్వం అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన మూడేళ్ల పాలన బాగుందని ఆమె అన్నారు. గతంలో చాలా సార్లు చెప్పాను. చంద్రబాబుగారితో కలిసి పనిచేయాలనుందని, అందుకే అతి త్వరలోనే టీడీపీలో చేరతానని చెప్పారు. అవకాశం వస్తే చిత్తూరు జిల్లా నుంచి నగరి నుంచి పోటీ చేస్తానని, వైసీపీ నేత రోజాను ఎదుర్కోవడం కష్టమేమి కాదని అన్నారు. ప్రస్తుతం టీడీపీలో చేరే విషయంపై ఫోకస్ చేస్తున్నానని, ఆ సినిమా గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు.