పందెంకోడి 2' కి ప్రేక్షకులనుండి వచ్చిన రెస్పాన్స్ తో ఫుల్ హ్యాపీ గా ఉన్నాడు యాక్షన్ హీరో విశాల్. ముఖ్యంగా బీ సి సెంటర్లలో 'పందెంకోడి 2' కలెక్షన్స్ జోరుగా ఉన్నాయి. దీంతో 'పందెం కోడి 3' త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్తామని అంటున్నాడు. మొదటి సీక్వెల్ తీసేందుకు 13 ఏళ్ళు పట్టిందని... కానీ రెండో సీక్వెల్ ను త్వరగానే పట్టాలెక్కిస్తామని అంటున్నాడు. రీసెంట్ ఒక ఇంటర్వ్యూ లో ఇంకా చాలా విషయాలు పంచుకున్నాడు విశాల్.
'పందెంకోడి 3' కాకుండా మరే సినిమా సీక్వెల్స్ అయినా ప్లాన్ చేస్తున్నారా అని అడిగితే 'డిటెక్టివ్'.. 'అభిమన్యుడు' సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నామన్నాడు. 'టెంపర్' తమిళ రీమేక్ గురించి అడిగితే సగానికి పైగా షూటింగ్ పూర్తయిందని తెలిపాడు. ఇక ఎన్టీఆర్ పాత్ర కోసం ఏమైనా హోంవర్క్ చేశారా అని అడిగితే.. "చిన్నప్పటి నుండి హోమ్ వర్క్ చేసే అలవాటు లేదు. అదే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ను నేను ఇమిటేట్ చేయదలుచుకోలేదు. సినిమాను ఒక్కసారే చూశాను.. తారక్ యాక్టింగ్ నచ్చింది" అన్నాడు.
ఇక విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్ ను పెళ్ళి చేసుకుంటాడని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అదే విషయం గురించి అడిగితే "వరలక్ష్మి నాకు చిన్ననాటి స్నేహితురాలు. బెస్ట్ ఫ్రెండ్.. సోల్ మేట్. కానీ తనతో పెళ్ళి గురించి చెప్పడానికేమీ లేదు. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అవన్నీ నెరవేరాకే పెళ్ళి. దానికి కొంత సమయం పట్టొచ్చు" అన్నాడు.
చిత్ర పరిశ్రమను ఊపేస్తున్న మీటూ గురించి మాట్లాడుతూ "నడిగర్ సంగం తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేశాం. ఎవరైతే తప్పుగా ప్రవర్తించారో వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అదే సమయంలో ఎవరైనా #మీటూ ను దుర్వినియోగం చేసినట్టు మా దృష్టి కి వస్తే వారిపైనా చర్యలు తీసుకుంటాం" అన్నాడు. ఇక ఇండస్ట్రీ కి కొత్తగా వచ్చేవారికి ఇలాంటి విషయాలపై కౌన్సెలింగ్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని చెప్పాడు.