స్టార్ కి..యాక్ట‌ర్ కి మ‌ధ్య వ‌ర్మ గీసిన గీత‌!

Update: 2022-06-25 07:42 GMT
పెద్ద స్టార్ అవ్వాల‌ని ఇండ‌స్ర్టీకి ఎంతో మంది వ‌స్తారు. కానీ అందులో కొంత మందే స్టార్లు అవుతారు. ఇంకొంత మంది ఎలా వ‌చ్చారో? అలాగే తిరిగి ఇంటికెళ్లిపోతారు. మరికొంత‌ మంది హీరోలుగా కొన్ని సినిమాలు చేసి అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా ట‌ర్న్ తీసుకుంటారు. వీటికి ర‌క‌ర‌కాలు కార‌ణాలుంటాయి. కొంత మంది ఓవ‌ర్ నైట్ లో స్టార్ అవుతారు. ఇంకొంత మందికి ఆ హోదా రావ‌డానికి  కొన్నేళ్ల స‌మ‌యం ప‌డుతుంది.

ఇక్క‌డ ట్యాలెంట్ తో పాటు  ల‌క్ ఫ్యాక్ట‌ర్ అన్న‌ది కూడా కీల‌క పాత్ర పోషిస్తుంది. ఆ విష‌యాలు ఎలా ఉన్నా...తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రాంగోపాల్ వ‌ర్మ‌...స్టార్ కి..న‌టుడికి మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసాన్ని చూపే  ప్ర‌య‌త్నం ప్ర‌శంస‌నీయం. స్టార్ అనే వాడు వ‌ర్మ ఉద్దేశంలో ఎప్పుడూ మార‌డు. ఒకేలా ఉంటారు.  ర‌జ‌నీకాంత్ గ‌త 40 ఏళ్ల‌గా ఒకే ర‌క‌మైన పాత్ర‌లు పోషిస్తున్నారు.

గెట‌ప్ మారుతుంది. విగ్గు మారుతుంది. సీన్ మారుతుంది. పాట మారుతుంది. త‌ప్ప ఆయ‌న ప్రంజెంటేష‌న్ ఒకేలా ఉంటుంది. ఎప్పుడైతే ఒక న‌టుడు ఎక్కువ వేరియ‌షన్స్ ఇస్తాడో అత‌ను సాధార‌ణంగా స్టార్ అవ్వ‌డు. అలాంటి వాళ్ల‌కి న‌టుడిగా క్రెడిబిలిటీ వ‌స్తుంది. స్టార్ డ‌మ్ కి...క్రెడిబిలిటీకి చాలా తేడా ఉంది. అమితాబ‌చ్చ‌న్..షారుక్ ఖాన్ ఇలా చాలా మంది స‌న్నివేశం లో వేరియ‌ష‌న్స్ చూపిస్తారు త‌ప్ప స్టార్ డ‌మ్ ని దాటి బ‌య‌ట‌కు రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.

ఆడియ‌న్స్ కూడా అలాగే ఫిక్స్ అయ్యారు. ఒక సెక్ష‌న్ అడియ‌న్స్ నుంచి రొటీనే అనే కామెంట్ వినిపిస్తున్న‌ప్ప‌టికీ చివ‌రిగా వాళ్లు కాంప్ర‌మైజ్ అయిపోతారు. నా దృష్టిలో గొప్ప న‌టులు అంటే ఇండియాలో ఇద్ద‌రే ఇద్ద‌రు.

వాళ్లే బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్...మ‌లాయ‌ళం న‌టుడు ఫ‌హ‌ద్ పాజ‌ల్. హాలీవుడ్ లో మైఖెల్ కార్లోస్ స‌హా చాలా మంది న‌టులు స్టార్ల ఇమేజ్ తో  పాటు..నటులుగా క్రెడిబిలిటీ  పేరు తెచ్చుకున్నారు. ఫాత్ బ్రేకింగ్  పెర్పార్మెన్స్  ఓరియేంటెడ్ రోల్స్ చేసిన‌ప్పుడే ఏ స్టార్ అయినా..న‌టుడైనా సంపూర్ణ‌మైన సినిమా వాడు అనిపించ‌కోగ‌ల‌డు' అని వ‌ర్మ అన్నారు.

నిజంగా వ‌ర్మ స‌ల‌హాలు న‌వ‌త‌రానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇలాంటి వాటిని రిఫ‌రెన్స్ గా తీసుకుని..యాక్టింగ్ స్కిల్స్  పెంచుకోగల్గితే షైన్ అవ్వ‌డానికి  అవ‌కాశం ఉంటుంది. స్టార్ కి ..న‌టుడికి మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసాన్ని ఇప్ప‌టివ‌ర‌కూ  ఏ ద‌ర్శ‌కుడు చెప్పే ప్ర‌య‌త్నం  చేయ‌లేదు. చెప్పినా వ‌ర్మ అంతా గొప్ప గా డిరైవ్  చేయ‌లేర‌ని చెప్పొచ్చు. అందుకేగా వ‌ర్మ నుంచి  ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు వ‌చ్చాయి. ఎన్ని విమ‌ర్శ‌లొచ్చినా వ‌ర్మ‌ని ఓ బ్రాండ్ అని ఎందుకంటారంటే? అందుకే మ‌రి.
Tags:    

Similar News